ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల ఆకలి తీర్చేందుకే రేషన్‌ కార్డుల పంపిణీ

ABN, First Publish Date - 2021-07-24T04:51:15+05:30

పేదల ఆకలి తీర్చేందుకే రేషన్‌ కార్డుల పంపిణీ

మాట్లాడుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
  • జిల్లాలో 35,488 మంది లబ్ధిదారులకు రేషన్‌ కార్డులు మంజూరు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : పేద ప్రజల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ కొత్తగా రేషన్‌ కార్డుల పంపిణీకి నిర్ణయించారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ పనితీరును సమీక్షించారు. రంగారెడ్డి జిల్లాలోని 35,488 మంది లబ్ధిదారులకు రేషన్‌ కార్డులు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన రేషన్‌కార్డులను ఈ నెల 26 నుంచి 31 వరకు పంపిణీ చేసేవిధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త రేషన్‌కార్డుల లబ్ధిదారులందరికీ ఆగస్టు నుంచి బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా రేషన్‌ బియ్యాన్ని అందించడం జరిగిందని, కొత్త కార్డులు లేకపోవడంతో కొంతమందికి ఉచిత బియ్యం లభించలేదన్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న  నిర్ణయంతో బియ్యం తీసుకునే అవకాశం లభించిందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి అధికారులు కృషిచేయాలని ఆమె కోరారు. సమావేశంలో కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు, డీఎ్‌సవో రాథోడ్‌, సివిల్‌ సప్లయ్‌ డీఎం శ్యామారాణి, బాలసరోజ, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T04:51:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising