ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ కార్డుల పంపిణీలో ఫ్లెక్సీ లొల్లి

ABN, First Publish Date - 2021-07-27T04:46:07+05:30

రేషన్‌ కార్డుల పంపిణీలో ఫ్లెక్సీ లొల్లి

వాదించుకుంటున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గీయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గీయుల వాగ్వాదం

బషీరాబాద్‌: దామర్‌చెడ్‌లో రేషన్‌కార్డుల పంపిణీలో సోమవారం ఎ మ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గ సర్పంచ్‌ నర్సిరెడ్డి స్టేజీమీద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఉమ్మడి పంచాయతీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే వర్గీయులు కొందరు ఫ్లెక్సీలో స్థానిక ప్రజాప్రతినిధుల ఫొటోలు లేవని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్సీ వర్గీయులు సర్పంచ్‌ గౌరవంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఫొటోలు పెట్టినా రాద్ధాంతం చేయడం తగదన్నారు. గొడవపెద్దది కావడంతో అధికారులు సభలోంచి ఫ్లెక్సీ తీయించారు. అం తకు ముందు గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలను తమ తమవర్గీయులు వేర్వేరుగా డప్పు చప్పుళ్లలో ర్యాలీగా సభ ప్రాంగణానికి తీసుకురావడం చర్చనీయాంశమైంది. 


  • ఎమ్మెల్యే, ఎమ్మె ల్సీ ఎదుటే నాయకుల వాగ్వాదం


బంట్వారం(కోట్‌పల్లి): కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం కోట్‌పల్లిలో రసాభాసగా మారింది. తహసీల్దార్‌ కార్యాలయంలో కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హాజరయ్యారు. ఫ్లెక్సీ విషయంలో కోట్‌పల్లి సర్పంచ్‌ విజయలక్ష్మి మరిది బందెయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భర్త పతంగి పాండుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ముందే వాగ్వాదానికి దిగారు. ఎ మ్మెల్సీ, ఎమ్మెల్యే వారిని సముదాయించారు. అనంతరం 205 మందికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. 


  • ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించలేదు : ఎంపీటీసీ ప్రవీణ్‌


తాండూరు: రుద్రారంలో రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి తన ను ఆహ్వానించకుండా అవమానించారని ఇందూర్‌ ఎంపీటీసీ పటేల్‌ ప్ర వీణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే హాజరైన కార్యక్రమానికి ప్రొటోకాల్‌ పాటించకుండా స్థానిక ప్రజాప్రతినిధినైన తనను ఆహ్వానించలేదని, దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఎంపీటీసీలు, ప్ర జాప్రతినిధులతో తహసీల్దార్‌ ఆఫీసు ఎదుట ధర్నాచేస్తానన్నారు.

Updated Date - 2021-07-27T04:46:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising