ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌తో కరోనా ముప్పు దూరం

ABN, First Publish Date - 2021-10-30T04:32:26+05:30

వ్యాక్సిన్‌తో కరోనా ముప్పు దూరం

షాద్‌నగర్‌ : గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్న ఆర్డీవో రాజేశ్వరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆర్డీవో రాజేశ్వరి 
  • గ్రామాల్లో ముమ్మరంగా వ్యాక్సినేషన్‌


షాద్‌నగర్‌రూరల్‌/కేశంపేట/ఆమనగల్లు/కడ్తాల్‌/యాచారం/ కందుకూరు: కరోనా ముప్పు నుంచి తప్పించుకునేందుకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని ఆర్డీవో రాజేశ్వరి తెలిపారు. ఫరూఖ్‌నగర్‌ మండలం చించోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని చౌలపల్లి, దొంతికుంటతండా, పీర్లగూడ, మొగిలిగిద్ద గ్రామాల్లో శుక్రవారం పర్యటించి వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. మొగిలిగిద్దలో ఇంటింటికి తిరిగి టీకా వేయించుకోవాలని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిన గ్రామాల ప్రజలను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శరత్‌బాబు, హెల్త్‌ ఎడ్యూకేటర్‌ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కేశంపేట మండల పరిధి పాపిరెడ్డిగూడలో వందశాతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని ఆరోగ్య సిబ్బందిని ఏఎన్‌ఎం సంతోష, ఆశా కార్యకర్తలు సుజాత, సువర్ణలకు సర్పంచ్‌ తాండ్ర విష్ణువర్ధన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం గ్రామంలోని వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. గ్రామంలో ఎంత మందికి వ్యాక్సిన్‌ వేశారో అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తదితరులున్నారు. అపోహలు వీడి అర్హులందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఆమనగల్లు మున్సిపల్‌ కౌన్సిలర్‌ సోనిజయరామ్‌ సూచించారు. మున్సిపాలిటీ పరిధి 9వ వార్డు శ్రీకాంత్‌ కాలనీలో శుక్రవారం కరోనా టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నాయకులు గుత్తి బాలస్వామి, శ్రీను, మల్లేశ్‌ నాయక్‌, ఆరోగ్య సిబ్బంది, లక్ష్మి, సీతమ్మ, ఆశా వర్కర్లు నిర్మల, అలివేలు, సంతోష, విజయ, సల్మ తదితరులు పాల్గొన్నారు. కడ్తాల్‌ మండల పరిధి ఎక్వాయిపల్లి గ్రామంలో శుక్రవారం కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్‌ జంగం సుగుణ సాయిలు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. గ్రామంలో వంద శాతం వ్యాక్సినేషన్‌ చేపడతామని సర్పంచ్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఉమావతి, వైద్య సిబ్బంది, నాయకులు లక్ష్మి, అరుణ, హంసమ్మ, శాంతమ్మ, శ్రీను, పాండు, వెంకట్‌, రవి, హరీశ్‌, తదితరులు పాల్గొన్నారు.  కొవిడ్‌ బాధితులను ఆదుకోవాలని ఎంపీపీ కొప్పు సుకన్యబాషా. వైస్‌ ఎంపీపీ కె.శ్రీనివాస్‌రెడ్డిలు ప్రభుత్వాన్ని కోరారు.  శుక్రవారం మండల పరిధి గున్‌గల్‌ గ్రామంలో వాటర్‌ సంస్థ ఆధ్వర్యంలో  50మంది కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కె.ఇందిర. వాటర్‌ సంస్థ ప్రతినిధులు కృష్ణగౌడ్‌, రేణుక. సరేష్‌., శ్రావణి తదితరులున్నారు. జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్‌ వేస్తామని కందుకూరు డివిజన్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ వినోద పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సినేషన్‌ గురించి వైద్యులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ ఉదయం పది గంటలకే గ్రామాలవెళ్లి కరోనా వ్యాక్సిన్‌ వేయాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. 

Updated Date - 2021-10-30T04:32:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising