ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపద్మనాభ స్వామి ఆలయానికి కరోనా సెగ

ABN, First Publish Date - 2021-04-19T04:16:25+05:30

అనంతపద్మనాభ స్వామి ఆలయానికి కరోనా సెగ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వారం రోజులపాటు భక్తులకు దర్శనం నిలిపివేత

వికారాబాద్‌: కరోనా సెకండ్‌వేవ్‌ ప్రభావంతో మరో సారి వికారాబాద్‌ జిల్లాలోని అనంతపద్మనాభ స్వామి ఆలయానికి సెగ తగిలింది. ఆదివారం ఆలయంలో పలువురికి కరోనా పాజిటివ్‌ రావడంతో సోమవారం నుంచి ఆలయ దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శేఖర్‌గౌడ్‌, ఆలయ ఫౌండర్‌ పద్మనాభంలు ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు రోజుల పాటు ఆలయానికి భక్తులు ఎవరూ రావద్దని, 21న శ్రీరామనవమి రోజు అంతర్గతంగా స్వామి వారి కల్యాణం ఆలయఅర్చకులు నిర్వహిస్తారని తెలిపారు. సోమవారం నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతిలేదని తెలిపారు.

  • కరోనా హెల్త్‌ బులిటెన్‌ నిలిపివేత

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌): వికారాబాద్‌ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అఽధికారులు జారీచేసే హెల్త్‌ బులిటెన్‌ నిలిపివేశారు. రోజురోజుకు రికార్డుస్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోవడం, జిల్లా హెల్త్‌ బులిటెన్‌లోని కేసులకు, రాష్ట్రహెల్త్‌ బులిటెన్‌లో ఉన్న కేసులకు భారీ వ్యత్యాసం ఉంటోంది. ఈ క్రమంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల సూచన  మేరకు జిల్లాఅధికారులు హెల్త్‌ బులిటెన్‌ నిలిపివేసినట్లు సమాచారం.

Updated Date - 2021-04-19T04:16:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising