ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి

ABN, First Publish Date - 2021-10-25T04:52:55+05:30

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి

ట్రెసా కొత్త కార్యవర్గంతో గౌతమ్‌కుమార్‌ , బాణాల రాంరెడ్డి, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్‌ 

వికారాబాద్‌: రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌  (ట్రెసా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్‌ అన్నారు. శనివారం వికారాబాద్‌ జిల్లా వికారాబాద్‌లో రవీంద్ర మండపంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ వికారాబాద్‌ జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఎన్నికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెవెన్యూ, ధరణి సమస్యల పరిష్కారం పట్ల ట్రెసా కొత్త కార్యవర్గం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. రెవెన్యూ, ధరణి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ పలుమార్లు తిరిగే పరిస్థితి ఎదురుకాకుండా చూడాలన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమం తమకు వదిలేయాలని, ప్రభుత్వంతో కొట్లాడి ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని చెప్పారు. రెవెన్యూ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు ఇబ్బందులు పడకుండా సరైన మార్గదర్శనం చేయాలని, రెవెన్యూ శాఖకు మంచి పేరు తీసుకువచ్చే విధ ంగా పని చేయాలని ఆయన సూచించారు. ఈ సందర ్భంగా ట్రెసా జిల్లా అధ్యక్షుడిగా వికారాబాద్‌ తహసీల్దార్‌ బి.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శిగా డిప్యూటీ తహసీల్దార్‌ విజయేందర్‌, అసోసియేట్‌ అధ్యక్షులుగా ఆనందం, బాల్‌రాజ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌గా తులసీరాం, నర్సింహారెడ్డి, వహీద్‌ ఖతుమ్‌, ఖాజాపాషాలను నియమించారు. ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా శ్రీనివాస్‌రెడ్డి, విజయ్‌, జాయింట్‌ సెక్రటరీలుగా రవీందర్‌, అశోక్‌, భారతమ్మ, స్పోర్ట్స్‌ సెక్రటరీగా సురేష్‌, కోశాధికారిగా మహేష్‌గౌడ్‌, ఈసీ సభ్యులుగా శ్రీనివాస్‌రావు, మానిక్‌రావు, మోహన్‌, నరేష్‌కుమార్‌, రాములు, భాగ్యలక్ష్మి, శశికళలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా బాణాల రాంరెడ్డి వ్యవహరించారు.

Updated Date - 2021-10-25T04:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising