డయల్ ఇన్ గ్రీవెన్స్‌కు ఫిర్యాదుల వెల్లువ
ABN, First Publish Date - 2021-08-26T05:22:50+05:30
డయల్ ఇన్ గ్రీవెన్స్‌కు ఫిర్యాదుల వెల్లువ
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ మోతీలాల్
వికారాబాద్ : భూసమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహించిన డయల్ ఇన్ గ్రీవెన్స్‌కు 20 దరఖాస్తులు అందాయని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో డయల్ ఇన్ గ్రీవెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ. ధరణి సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి బుధవారం 08416 256989కు ఫోన్ చేసి సమస్యలను తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలోఈడీఎం మహమూద్ అలీ, ధరణి కోఆర్డినేటర్ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-08-26T05:22:50+05:30 IST