ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల అనుభవాలు తెలుసుకున్న కమిషనర్‌

ABN, First Publish Date - 2021-02-28T04:58:46+05:30

రైతుల అనుభవాలు తెలుసుకున్న కమిషనర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిఅర్బన్‌) : వ్యవసాయ ఉత్పత్తుల కమిష నర్‌, ప్రధాన కార్యదర్శి జనార్దన్‌రెడ్డి శనివారం రాష్ట్రంలోని ఏఈవోలు, అభ్యదయ రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని ముగ్గురు  రైతులతో ఆయన మాట్లాడారు. ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడేనికి చెందిన రైతు ఎం.అంజిరెడ్డి తన పొలంలో వానాకాలంలో ఆముదం వేసినట్లు, పంటకు బూజు తెగులు, దాసరి పురుగు సోకిందని తెలిపారు. యాసంగిలో వినూత్నంగా 3 ఎకరా ల్లో డ్రిప్‌ విధానంలో ఆముదం వేసినట్లు తెలిపారు. దీంతో ఎకరానికి రూ.71 వేల చొప్పున నికర ఆదాయం ఆర్జించినట్లు వివరించారు. అలాగే ఆదే మండలం నాగంపల్లికి చెందిన కొండల్‌రావు తన పొలంలో డ్రిప్‌ విధానంతో చామగడ్డను సాగు చేసి ఎకరానికి రూ.80 వేల ఆదాయం ఆర్జించినట్లు తెలిపారు. తలకొండపల్లి మండలం చుక్కపూర్‌కు  చెందిన పాండురంగారెడ్డి ప్రభుత్వ సాయంతో పాలీహౌస్‌ నిర్మించి అందులో టమాట, చెర్రీ, క్యాప్సికం పంటలు పండించినట్లు తెలిపారు. టమాట రూ.8 లక్షలు, చెర్రీ, కాప్సికం ద్వారా రూ.7.5 లక్షలు ఆదాయం పొందినట్లు రైతు వివరించారు. ముగ్గురు రైతులను వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్‌ అభినందించారు. 

Updated Date - 2021-02-28T04:58:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising