ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2021-10-26T04:22:21+05:30

గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు

సమీక్షలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సమీక్ష సమావేశంలో  మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి): మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో కొందరు గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారముందని,  పరిశీలించి బాధ్యులపై  కఠిన చర్యలు తీసుకోవాలని  ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో గంజాయి సాగు, మారక ద్రవ్యాల కట్టడిపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అబ్కారీశాఖ గంజాయి సాగు కట్టడిపై దృష్టి సారించాలని,  అవసరమైతే పోలీసుల సాయం తీసుకోవాలని అదేశించారు. గంజాయి సాగు చేస్తున్న వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి, ఆరీవోలు రవి, మల్లయ్య, వ్యవసాయ అధికారి మేరీ, ఉద్యానశాఖ అధికారి సత్తార్‌, ఏడీ వెంకట్రామ్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. కాగా యాసంగిలో  వరి బదులు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించే విధంగా చర్యలు చేపట్టాలని హరీష్‌ వ్యవసాయశాఖ అధికారులను అదేశించారు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ బియ్యం సేకరణ నిలిపి వేసిన దృష్యా అధికారులు రైతుల్లో అవగాహన కల్పించి వరికి బదులు ఇతర పంటలను సాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. శనగ, వేరుశనగ, వినులు, నువ్వులు, పెసర, పొద్దు తిరుగుడు పంటలపై దృష్టి సారించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వానాకాలంలో పండించిన ధాన్యాన్ని 11 కేంద్రాల ద్వారా  మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు.

Updated Date - 2021-10-26T04:22:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising