ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ కట్టడాలు.. చర్యలు ఎక్కడ?

ABN, First Publish Date - 2021-12-15T04:26:57+05:30

శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలకు

అనుమతులు లేకుండా చేపడుతున్న భవన నిర్మాణం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు 
  • ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌.. నిద్రమత్తులో అధికారులు


శంకర్‌పల్లి : శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అంతులేకుండా పోతోంది. అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేవారే లేకుండా పోయారు. ఏ వీధిలో చూసినా రోడ్లను కబ్జా చేస్తూ.. పార్కింగ్‌కు సెల్లార్లను వదిలేయకుండా.. బాల్కానీలను పెంచి బహుళ అంతస్థులు నిర్మిస్తున్నారు. అనుమతులు ఒకదానికి తీసుకుంటూ.. నిర్మాణాలు మరో విధంగా చేపడుతున్నారు. ఇంతజరుగుతున్నా మున్సిపల్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల మున్సిపల్‌ పట్టణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అరవింద్‌కుమార్‌ మున్సిపల్‌ కమిషనర్లకు సూచించినా వారిలో కదలిక కనిపించడం లేదు. 

శంకర్‌పల్లి మున్సిపల్‌ అధికారులు కార్యాలయాలకే పరిమితం కావడంతో అక్రమ కట్టడాలు కొనసాగుతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో అక్రమ కట్టడాలను గుర్తించాల్సింది పోయి తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిప్ల్‌సటూకే అనుమతి అని ప్రకటించినా అక్రమార్కులు 5 అంతస్థులు భవన నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు జీప్ల్‌సటూకు అనుమతి తీసుకొని ఐదు అంతస్థుల భవనాలను నిర్మిస్తున్నారు. ఈ విధంగా తప్పుడు అనుమతులతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిద్ర మత్తులో తూగుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లోనై, మామూళ్లకు అలవాటు పడే అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. కొందరు పార్కింగ్‌కు సెల్లార్స్‌ వదిలేయకుండా బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టి యథేచ్ఛగా అద్దెకు ఇచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించాలని స్థానికులు కోరుతున్నారు.


కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం

అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశిం చినా మున్సిపల్‌ అధికారులు పట్టించు కోవడం లేదు. మున్సిపల్‌ కమిషనర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కార్యాలయాలకే పరిమితమై అక్రమా ర్కులపై చర్యలు తీసుకోవడం లేదు. నిర్లక్ష్యం వహిస్తే అధికా రులపై ప్రభుత్వానికి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం.

- విజయలక్ష్మి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, శంకర్‌పల్లి


అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు 

అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పరిధిని మించి నిర్మిస్తే నోటీసులు జారీచేసి వాటిని కూల్చి వేస్తాం. ఎక్కడైనా అక్రమ కట్టడాలు నిర్మిస్తే మా దృష్టికి తీసుకొస్తే ఎంతటి వారైనా ఉపేక్షించం. నిబంధనల ప్రకా రం భవనాలు నిర్మించుకోవాలి. అక్రమ కట్టడాలపై చర్యలు తీసు కోవాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం.

- యాదగిరి, మున్సిపల్‌ కమిషనర్‌, శంకర్‌పల్లి



Updated Date - 2021-12-15T04:26:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising