ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిశ్రద్ధలతో బోనాలు

ABN, First Publish Date - 2021-09-04T04:42:57+05:30

భక్తిశ్రద్ధలతో బోనాలు

కేశంపేట : బోనాలతో వెళ్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేశంపేట/మాడ్గుల/తలకొండపల్లి/కడ్తాల్‌: కేశంపేట మండల కేంద్రంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో చెర్ల మైసమ్మ, చౌడమ్మ బోనాలను నిర్వహించారు. సర్పంచ్‌ తలసాని వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళలు బోనాలతో ఆలయాలకు వెళ్లి గ్రామదేవతలకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా ఎక్లా్‌సఖాన్‌పేట గ్రామంలో ఎంపీపీ రవీందర్‌యాదవ్‌, వెంకన్నయాదవ్‌ ఆధ్వర్యంలో కట్ట మైసమ్మ బోనాలు నిర్వహించారు. మాడ్గుల మండలంలోని కలకొండ గ్రామంలో శుక్రవారం సర్పంచ్‌ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోచ మ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. తలకొండపల్లి మండల పరిధిలోని పడకల్‌ గ్రామంలో శుక్రవారం బోనాల పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. బోనాల వేడుక అంబురాన్నంటింది. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ వేడుకల్లో పాల్గొని కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అదే విధంగా కడ్తాల మండలం ముద్విన్‌ గ్రామంలో బోనాల తొట్టెల ఉరేగింపు ఘనంగా నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు శ్రీనివా్‌సగౌడ్‌, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 

ఊడుగుల పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం సమీపంలోని తట్టిఖానా దగ్గర ఊడుగుల పోచమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. గున్న రాజేందర్‌రెడ్డి విగ్రహాన్ని తయారు చేయించారు. ఎంపల్ల సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

సామూహిక వ్రతాలు, కుంకుమార్చన 

యాచారం/షాద్‌నగర్‌అర్బన్‌:  మండల పరిధి నందివనపర్తి గ్రామంలోని శ్రీ జ్ఞానసరస్వతీ మాత  అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9గంటలకు కుంకుమార్చన, సహస్ర నామార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ మాస చివరి శుక్రవారం సందర్భంగా  సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు. అర్చకులు రాఘవేందర్‌ శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. షాద్‌నగర్‌ మున్సిపాలిటీలోని ఫరూఖ్‌నగర్‌ బ్రహ్మంగారి ఆలయంలో శుక్రవారం సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఽధర్మప్రచార కమిటీ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కన్వీనర్‌ రామాచారి నేతృత్వంలో మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అంతయ్య, చంద్రకళ, కె.మహేశ్వరి, రామలింగం, సుమతి, విద్యాసాగర్‌, నర్సింహులు, పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-04T04:42:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising