ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్తదాతలు.. ప్రాణదాతలు

ABN, First Publish Date - 2021-01-16T05:49:31+05:30

రక్తదాతలు.. ప్రాణదాతలు

రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఉప్పల వెంకటేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు : ప్రాణాపాయ స్థితిలో ఉన్న తోటివారిని కాపాడడంలో రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారని తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్‌ అన్నారు. నేత్ర, రక్త, అవయదానాలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వారికి అవగాహన కల్పించేందుకు యువకులు, విద్యావంతులు, స్వచ్ఛంధ సంస్థలు కృషి చేయాలని ఆయన కోరారు. ఆమనగల్లులోని కల్యాణి గార్డెన్‌లో శుక్రవారం ఉప్పల ట్రస్ట్‌, ఆమనగల్లు లయన్స్‌ క్లబ్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో 203 మంది రక్తదానం చేశారు. ఆరోగ్యవంతమైన యువతీ, యువతులు రక్తదానం చేయాలని కోరారు. అదే విధంగా తలకొండపల్లి మండలం పాతకోట తండాలో ఉప్పల ట్రస్ట్‌ ద్వారా ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని ఎంపీపీ నిర్మల శ్రీశైలంగౌడ్‌తో కలిసి వెంకటేష్‌ ప్రారంభించారు. తలకొండపల్లి మండలం చీపునుంతల, పాతకోట తండాలో 32 మంది నిరుపేదలకు ట్రస్ట్‌ ద్వారా చేపట్టే ఇళ్ల నిర్మాణానికి వెంకటేష్‌ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలాజీసింగ్‌, కౌన్సిలర్‌ సబావత్‌ కృష్ణనాయక్‌, అంబేద్కర్‌ మనుమడు ప్రకాశ్‌ అంబేద్కర్‌, ట్రస్ట్‌ సభ్యులు మంజుల, ఉప్పల అఖిల్‌, అనిల్‌, నాగిళ్ల జగన్‌ గోపాల్‌నాయక్‌, లలిత జ్యోతయ్య, కసిరెడ్డి రాంరెడ్డి, పాపిశెట్టి రాము, అలివేలు, రఘుపతి, రవి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:49:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising