సర్వే పనులు ప్రారంభం
ABN, First Publish Date - 2021-06-10T04:44:44+05:30
సర్వే పనులు ప్రారంభం
అంతారం గ్రామ సమీపంలో ల్యాండ్ లెవెలింగ్ సర్వే చేస్తున్న సిబ్బంది
తాండూరు రూరల్: తాండూరు మండలం అంతారం, గౌతాపూర్, చెంగోల్, బెల్కటూర్ గ్రామాల్లో నాలుగు రోజులుగా ముగ్గురు అధికారుల బృందం ల్యాండ్ లెవెలింగ్ సర్వే పనులను చేపట్టారు. అయితే తాండూరు ప్రాంతం నుంచి ముంబయ్‌కి ఇటీవల బుల్లెట్ ట్రైన్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు సర్వే నిర్వహిస్తున్నారా? లేదా ధరణిలో భాగ ంగా ప్రభుత్వ భూములపై సర్వే నిర్వహిస్తున్నారా? అనే తేల్చడం లేదు. కొందరైతే బు ల్లెట్ ట్రైన్ మంజూరైనందుకే సర్వే చేస్తున్నట్లు చెబుతున్నారు. సర్వే సిబ్బందిని అడిగినా వారు వివరాలు చెప్పడం లేదు. పై అధికారులకే తెలుసంటున్నారు!
Updated Date - 2021-06-10T04:44:44+05:30 IST