ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి

ABN, First Publish Date - 2021-10-29T05:04:38+05:30

కేంద్రప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి

రాయిలాపూర్‌లో పల్లె ప్రకృతివనాన్ని పరిశీలిస్తున్న కేంద్ర పరిశీలన బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌: కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో ప్రజలందరికీ అందేటట్లు అవగాహన కల్పించాల్సిన బాధ్యత స్థానిక సంస్థలపై ఉందని ఎంఎల్‌ఎం కేంద్ర పరిశీలన బృందం ప్రొఫెసర్‌ మోహనన్‌ తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పనులు, పురోగతి రికార్డుల పరిశీలన నిమిత్తం గురువారం రాయిలాపూర్‌, మునీరాబాద్‌ గ్రామాల్లో కేంద్ర పరిశీలన బృందం పర్యటించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులుగా విచ్చేసిన సెంటర్‌ ఫర్‌ డెవల్‌పమెంట్‌ సొసైటీ అటానమ్‌స-కేరళ రాష్ట్ర ప్రొఫెసర్‌ మోహనన్‌, ప్రొఫెసర్‌ నందితలను ఆయా గ్రామాల సర్పంచ్‌లు శాలువాలతో సత్కరించారు. గ్రామపంచాయతీల రికార్డులతో పాటు, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ్‌సకు సంబంధించిన ఏడు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామాల్లో హరితహారంలో భాగంగా ఉపాధిహామీ పనుల ద్వారా నాటిన మొక్కలను, నర్సరీల నిర్వహణ, పల్లె ప్రకృతివనాలను, వ్యక్తిగత ఇంకుడుగుంతలను, కమ్యూనిటీ ఇంకుడుగుంతలకు సంబంధించిన తదితర రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో కేంద్ర పరిశీలన బృందం సభ్యులు, ఎండీవో వాణి, ఎంపీవో వినూత్న, సర్పంచ్‌లు నర్మదగోపాల్‌రెడ్డి, గణేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T05:04:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising