ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై దాడి సిగ్గుచేటు: బీజేపీ

ABN, First Publish Date - 2021-10-24T04:58:41+05:30

కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై దాడి సిగ్గుచేటు: బీజేపీ

వికారాబాద్‌: ఎన్టీఆర్‌ చౌరస్తాలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న బీజేపీ యువమోర్చా నాయకులు, కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌/తాండూరు/పరిగి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్‌ నాయకులు దాడి చేయటం సిగ్గుచేటని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అదనపు కార్యదర్శి వివేకానందరెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై దాడికి నిరసనగా శనివారం వికారాబాద్‌ పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో ఈటల రాజేందర్‌కు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక టీఆర్‌ఎస్‌ నాయకులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగాలు, దళితబంధు గుర్తుకు వస్తాయని, ఎన్నికల అనంతరం ఇచ్చిన హామీలన్నీ మర్చిపోతారని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళితబంధు పేరుతో దళితులను మోసం చేస్తుందని, వారి అకౌంట్‌లో డబ్బులు వేసి వాటిని ఫ్రీజ్‌ చేస్తున్నారని, ఇంకా ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారని విమర్శించారు. కేసీఆర్‌ పతనం ఖాయమైందని అన్నారు. కార్యక్రమంలో యువమోర్చా రాష్ట్ర నాయకులు సాయిచరణ్‌రెడ్డి, పక్షౌణ అధ్యక్షుడు సాయి, మండల ఇంఛార్జి భరత్‌, అభి, సాయిగుప్త, విక్రమ్‌రెడ్డి, దశరథ్‌, కార్తీక్‌, ప్రణీత్‌, సురేష్‌, అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తాండూరులోని అంబేద్కర్‌ చౌక్‌ వద్ద బీజేపీ నాయకులు  నిరసన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పూజారి పాండు, రజనీకాంత్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖండిస్తూ శనివారం పరిగిలో బీజేపీ నాయకులు అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రాన్ని ఇస్తూ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కార్యదర్శులు వెంకటయ్యగౌడ్‌; రాముయాదవ్‌; హరికృష్ణ, నాయకులు పెంటయ్య, ఆంజనేయులు, రమేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T04:58:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising