ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంప్యూటర్‌ ఆపరేటర్‌పై ఆర్డీవో విచారణ

ABN, First Publish Date - 2021-01-26T05:57:50+05:30

కంప్యూటర్‌ ఆపరేటర్‌పై ఆర్డీవో విచారణ

ఆపరేటర్‌ కాశీనాథ్‌పై విచారణ జరుపుతున్న ఆర్డీవో అశోక్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

36 బిల్లులపై విచారణ జరపాలన్న చైర్‌ పర్సన్‌, కౌన్సిలర్లు

తాండూరు: తాండూరు మున్సిపల్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ కాశీనాథ్‌పై తాండూరు ఆర్డీవో అశోక్‌కుమార్‌ విచారణ జరిపారు. సోమవారం తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న ఛాంబర్‌లో ఆమె సమక్షంలో విచారించారు. ఈ విచారణలో ఆర్డీవో అశోక్‌కుమార్‌ కాశీనాథ్‌తో మాట్లాడుతూ చైర్‌పర్సన్‌ బెదిరించారా? ఏమని ఒత్తిళ్లు తెచ్చి రాయించుకున్నారని ఇచ్చిన 36 బిల్లుల చెల్లింపుల ఫిర్యాదుపై సమగ్రంగా వివరించాలని అన్నారు. చైర్‌పర్సన్‌తోపాటు ఆమె భర్త తనకు పలుమార్లు బెదిరించింది వాస్తవమేనని ఆపరేటర్‌ కాశీనాథ్‌పేర్కొన్నారు. కమిషనర్‌ చేత ముందస్తు సంతకాలు తీసుకుని నిబంఽధనలకు విరుద్ధంగా ఉన్న బిల్లులను ఒత్తిడి తెచ్చి రాయించుకున్నారని వివరించారు. అక్కడే ఉన్న కొందరు కౌన్సిలర్లు తమ సొంత బిల్లు రాయించలేదని, మీరు కంప్యూటర్‌ ఆపరేటర్‌కు రావాల్సిన వేతనం చెల్లించాలనే బిల్లుతోపాటు పారిశుద్ధ్య కార్మికులకు ఏడాది నుంచి రావాల్సిన వేతనాలపై బిల్లులు చేయించాలని కోరడం జరిగిందని వివరించారు. మరోవైపు చైర్‌పర్సన్‌ స్వప్న, కౌన్సిలర్లు శోభారాణి, నీరజ, అకౌంటెంట్‌ ఉషా కాశీనాథ్‌కు కమీషన్లు అందే బిల్లును మాత్రమే ఓకే చేస్తారని ఆరోపించారు. చైర్‌పర్సన్‌ స్వప్న మాట్లాడుతూ కాశీనాథ్‌ను నేనేప్పుడూ బెదిరించలేదని, ఎప్పుడు కూడా ఒత్తిడి చేయలేదని, నిరాధారణమైన అభాండాలు వేయడం సరైంది కాదన్నారు. ఈ విచారణలో కౌన్సిలర్లు అబ్దుల్‌ రజాక్‌, రవి, ముక్తార్‌ నాజ్‌, వెంకన్నగౌడ్‌లున్నారు.

Updated Date - 2021-01-26T05:57:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising