ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షీ-క్యాబ్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

ABN, First Publish Date - 2021-01-24T05:14:31+05:30

షీ-క్యాబ్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌  

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : షీ-క్యాబ్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ కోరారు. ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి నిరుదోగ్య యువతులకు ఉచిత డ్రైవింగ్‌ శిక్షణ, మోటర్‌ క్యాబ్‌ కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంవత్సర ఆదాయం గ్రామీణులకు రూ.1.50 లక్షలు, పట్టణ వాసులకు రూ.2లక్షలు మించరాదన్నారు. మీసేవా నుంచి పొందిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఆధార్‌, రేషన్‌ కార్డు, లైసెన్స్‌ తప్పక కలిగి ఉండాలన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న అభ్యర్థులకు సీనియారిటీని బట్టి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు తెలుగు, హిందీ, ఇంగీ్‌షలో మాట్లాడటం రావాలని తెలిపారు. పదో తరగతి పాస్‌/ఫెయిలైన వారు అర్హులన్నారు. జూలై 1వ తేదీ నాటికి వయస్సు 21-50 సంవత్సరాలు కలిగి ఉండాలని, ఇంటికి ఒకరు చొప్పున మాత్రమే లబ్ధిపొందటానికి అర్హులని, ఒకసారి లబ్ధి పొందిన వారు మళ్లీ ఐదేళ్ల వరకు లబ్ధి పొందటానికి అనర్హులన్నారు. డ్రైవింగ్‌ నేర్చుకునే మహిళలకు 3 నెలల కాలపరిమితికి గాను భోజనంతో పాటు వసతి కల్పించనున్నామన్నారు. ఆసక్తిగల ఎస్సీ యువతులు కలెక్టరేట్‌, 4వ అంతస్తులోని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీని సంప్రదించాలని సూచించారు. 


వడ్డీ, ప్రీమియం మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలి

సెల్ప్‌హెల్ప్‌ గ్రూపుల రుణాలకు వడ్డీలు, అభయహస్తం ప్రీమియం మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌ పోశాల డిమాండ్‌ చేశారు. శనివారం ఆమె కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో సెల్ప్‌హెల్ప్‌ గ్రూపుల కింద వడ్డీలేని రుణాలకు చెల్లించాల్సిన రూ.320 కోట్లు చెల్లించేలా చొరవ తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. 


Updated Date - 2021-01-24T05:14:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising