ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్య సేవల్లో అంగన్వాడీ, ఆశాలది కీలకపాత్ర

ABN, First Publish Date - 2021-05-11T05:17:16+05:30

ఆరోగ్య సేవల్లో అంగన్వాడీ, ఆశాలది కీలకపాత్ర

అంగన్వాడీలకు నియామక పత్రాలందజేస్తున్న ఎమ్మెల్యే ఎం.కిషన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇబ్రహీంపట్నం: ప్రజల ఆరోగ్యం, మాతాశిశు సంరక్షణ, మహిళా చైతన్య కార్యక్రమాల్లో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మ్లెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. తులేకలాన్‌, లింగంపల్లి, సత్యంతండా అంగన్‌వాడీ కేంద్రాలకు ఎంపికైన వారికి సోమవారం తన క్యాంప్‌ కార్యాలయంలో నియామకపత్రాలందజేశా రు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు అంగన్‌వాడీల ద్వారా బలవర్ధక ఆహారాన్ని అంద జేస్తున్నారని గుర్తుచేశారు. మహిళా చైతన్య కార్యక్రమాల్లోనూ వీరి పాత్ర తక్కువేం కాదన్నారు. ఆశా వర్కర్లు కరోనా బాధితులకు సేవలందించడం అభినందనీయమ న్నారు. సీడీపీవో జి.శాంతిశ్రీ, ఏఎంసీ మాజీ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి ఉన్నారు.


  • విపత్కర పరిస్థితులను విజయానికి మెట్లుగా మలుచుకుందాం


ఇబ్రహీంపట్నం: కరోనా పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటూ ఈ సమయం లో పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. ఎంకేఆర్‌ ఫౌండేషన్‌ మహిళా అభ్యర్థులకు ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం లో స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు. నాలుగు నెలలు బాగా చదివితే ప్రభుత్వ ఉ ద్యోగం సాధించగల్గుతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 50వేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసిందని, కరోనా తగ్గగానే నోటిఫికేషన్లు వస్తాయన్నారు. ఎంకేఆర్‌ ఫౌండేషన్‌ సభ్యులు జె.రాజు, మడుపు శివసాయి, శివ, యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.


  • ఉద్యోగ, ఉపాధికి ప్రభుత్వం ప్రాధాన్యం 


ఆమనగల్లు: రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉపాధి, ఉద్యోగ కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని కడ్తాల జడ్పీటీసీ సభ్యుడు జర్పుల దశరథ్‌నాయక్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న సుమారు 50వేల ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లు ఐసీడీఎస్‌ కార్యాలయంలో సోమవారం పలు గ్రామాలకు నూతనంగా ఎంపికైన మినీ అంగన్‌వాడీ టీచర్లకు నియామక ఉత్తర్వుల ప్రతులను అందజేశారు. కార్యక్రమానికి జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌ ముఖ్య అతిథిగా హాజరై సీడీపీవో సక్కుబాయితో కలిసి ఎంపికై న వారికి నియామక ఉత్తర్వులను అందించారు. ఈ సందర్భంగా దశరథ్‌ మాట్లాడుతూ ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహించి ప్రజల అభిమానం చురగొనాలన్నారు. అంగన్‌వాడీ టీచర్లు గ్రామస్థాయిలో ప్రజా చైతన్య కార్యక్రమాల్లో ముం దుండాలని సూచించారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించి అవగాహన కల్పించాలని, ఆట, పాటల ద్వారా చిన్నారులను ప్రాథమిక విద్యకు సన్నద్ధం చేయాలని వివరించారు. కార్యక్రమంలో కర్కల్‌పహాడ్‌ ఎంపీటీసీ లచ్చిరామ్‌ నాయక్‌, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T05:17:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising