విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తే చర్యలు
ABN, First Publish Date - 2021-10-30T04:26:39+05:30
విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తే చర్యలు
- జిల్లా విద్యాధికారి సుశీంద్రరావు
శంకర్‌పల్లి : ఉపాధ్యాయులు విద్యార్థులపట్ల కఠినంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా విద్యాధికారి సుశీంద్రరావు అన్నారు. ఉపాధ్యాయురాలు బి.శ్వేత గాయపర్చిన 3 వ తరగతి విద్యార్థి సంజీవ్‌కుమార్(8) కుటుంబాన్ని శంకర్‌పల్లి మండలం ఫత్తేపూర్ గ్రామంలో ఆర్డీవో వేణుమాధవ్‌తో కలిసి శుక్రవారం పరామర్శించారు. విద్యార్థి తరగతి గదిలోకి అనుమతి లేకుండా వచ్చినందుకు, ఉమ్మి నేలపై పడ్డందుకు బాలుడితో కడిగించి అనంతరం కర్రతో బాలుడిని చితకబాదడం ఎంతో బాధాకరమని వారు పేర్కొన్నారు. కాగా, ఉపాధ్యాయురాలు శ్వేతను ఇప్పటికే సస్పెండ్ చేశామని, బాలుడి వైద్యానికయ్యే ఖర్చును భరిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్, కౌన్సిలర్ రాములు, గ్రామస్థులు తదితరులు ఉన్నారు.
Updated Date - 2021-10-30T04:26:39+05:30 IST