ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫీజులు దండుకుంటున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-06-18T04:23:56+05:30

ఫీజులు దండుకుంటున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న యాదీష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తెలగమల్ల యాదీష్‌ 


మహేశ్వరం: ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్న కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తెలగమల్ల యాదీష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఫీజులను నియంత్రించాలని గురువారం జిల్లా కలెక్టర్‌కు బీజేవైఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. కొవిడ్‌తో అసలే విద్యా సంస్థలు మూసి ఉంటే ఈ కాలంలోనూ ఫీజులు వసూలు చేయడం అమానవీయం అన్నారు. ఉద్యోగాలు పోయి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతోంటే ఫీజుల కట్టాలంటూ ప్రైవేటు విద్యా సంస్థలు వొత్తిడి చేయడం సరికాదన్నారు. దీనిపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారన్నారు. ప్రభుత్వం వెంటనే అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో బీజేవైఎం నాయకులు రాహుల్‌రెడ్డి, బ్రహ్మచారి, భగీరథ్‌, దిలీ్‌పగౌడ్‌, శ్రీశైలం, రణధీర్‌గౌడ్‌, బస్వా రఘుగౌడ్‌, బుగ్గని భరత్‌కుమార్‌, సాయులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T04:23:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising