దేవునిబండ తండాలో సంపూర్ణ మద్యనిషేధం
ABN, First Publish Date - 2021-10-22T05:19:24+05:30
దేవునిబండ తండాలో సంపూర్ణ మద్యనిషేధం
మద్య నిషేధంపై ప్రతిజ్ఞ చేస్తున్న గ్రామస్తులు
షాద్‌నగర్ రూరల్: ఫరూఖ్‌నగర్ మడలం దేవునిబండతండా వాసులు గురువారం సంపూర్ణ మద్య నిషేధానికి ప్రతినబూనారు. బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరగడంతో యువకులు మద్యానికి బానిసై అనారోగ్యం పాలవడంతో పాటు ఆర్థికంగా చితికిపోతున్నారని వారన్నారు. గ్రామస్తులు సమావేశమై తండాలో మద్యం అమ్మొద్దు, తాగొద్దని తీర్మానించారు. తండాలో ఎవరైనా మద్యాన్ని అమ్మినట్టు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇస్తామన్నారు. సర్పంచ్ మధులతమోహన్ పాల్గొన్నారు.
Updated Date - 2021-10-22T05:19:24+05:30 IST