ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓఎల్‌ఎక్స్‌లో కారు కొనబోయి మోసపోయిన యువకుడు

ABN, First Publish Date - 2021-05-10T04:50:59+05:30

ఓఎల్‌ఎక్స్‌లో కారు కొనబోయి మోసపోయిన యువకుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కారు యజమానికి ఆన్‌లైన్‌లో రూ.1లక్షా 40వేలు చెల్లింపు
  • డబ్బులు ముట్టాక యజమాని ఫోన్‌ స్విచ్ఛాఫ్‌
  • శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు

శంకర్‌పల్లి : ఓఎల్‌ఎక్స్‌లో ఇన్నోవా కారును కొనుగోలు చేసేందుకు ఓ యువకుడు గూగుల్‌పే ద్వారా డబ్బులు చెల్లించి మోసపోయిన ఘటన శంకర్‌పల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. శంకర్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపులారం గ్రామానికి చెందిన రాందాసు నవీన్‌కుమార్‌ ఓఎల్‌ఎక్స్‌లో ఇన్నోవా (ఎంహెచ్‌-11, ఏడబ్లు-7307) కారును కొనేందుకు సిద్దపడ్డాడు. ఈ క్రమంలో కారు యజమానిని 9671927372 నెంబర్‌లో సంప్రదించి, కారు కొనేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. కారు ధర రూ.1లక్షా50వేలు చెప్పగా నవీన్‌కుమార్‌ రూ.1లక్ష40వేలకు బేరం కుదుర్చుకున్నాడు. కాగా కారు యజమాని రూ.5వేలు అడ్వాన్స్‌ పంపమని కోరగా నవీన్‌కుమార్‌ గూగల్‌పే ద్వారా పంపించాడు. ఆ తర్వాత రూ.1లక్ష40వేలు మొత్తం ఫోన్‌పే ద్వారా చెల్లించినట్లు బాధితుడు తెలిపాడు. అయితే కారు యజమాని మహారాష్ట్ర నుంచి కారు పంపించేందుకు ట్రావెలింగ్‌ చార్జి కోసం అదనంగా రూ.31వేలు పంపమని కోరగా.. నవీన్‌కుమార్‌ తన వద్ద డబ్బులు లేకపోవడంతో స్నేహితుడు బేగరి నాగేశ్‌ సాయంతో రూ.31వేలు పంపించినట్లు తెలిపారు. ఆ తర్వాత అతడికి ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ రావడంతో శంకర్‌పల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2021-05-10T04:50:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising