ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

39 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం

ABN, First Publish Date - 2021-10-29T04:44:11+05:30

ఆమనగల్లు మండలం మేడిగడ్డ తండా, షాద్‌నగర్‌లో

పటుబడిన గంజాయి ప్యాకెట్లతో సీఐ ఉపేందర్‌, ఎస్‌ఐ ధర్మేశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు / షాద్‌నగర్‌రూరల్‌ : ఆమనగల్లు మండలం మేడిగడ్డ తండా, షాద్‌నగర్‌లో 39 గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఆమనగల్లు మండలపరిధిలోని మేడిగడ్డ తండాలో 17ఏళ్ల యువకుడు గంజాయి అమ్ముతున్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ ధర్మేశ్‌తో కలిసి సీఐ ఉపేందర్‌ మేడిగడ్డ గేటు వద్ద వాహనాల తనిఖీలో భాగంగా అనుమానంగా తిరుగుతున్న యువకుడిని పట్టుకొని విచారించారు. అతని వద్ద 250 గ్రాముల 20 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వెల్దండ మండలానికి చెందిన మహేశ్‌ అనే వ్యక్తి దగ్గర వాటిని కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు పట్టుబడిన యువకుడు పేర్కొన్నట్లు సీఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని క్లూస్‌ టీం, రెవెన్యూ అధికారులు సందర్శించి వివరాలు సేకరించారు. గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. గంజాయి సరఫరా చేస్తున్న మహేశ్‌తో పాటు మరికొందరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 


షాద్‌నగర్‌లో..

గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న యువకుడిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. షాద్‌నగర్‌ పట్టణంలోని పటేల్‌రోడ్డులో నివాసముంటూ హమాలీ పనిచేసే శివ(30) అనే యువకుడు గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో దాడిచేసి అతన్ని పట్టుకున్నామని ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌ తెలిపారు. అతని వద్ద ఉన్న 19 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.



Updated Date - 2021-10-29T04:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising