ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వికారాబాద్‌ జిల్లాలో 272 కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-04-13T05:26:26+05:30

వికారాబాద్‌ జిల్లాలో రోజూ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వైరస్‌తో ఒకరి మృతి


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో రోజూ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం జిల్లాలో ఏకంగా 272 కరోనా కేసులు నమోదవగా, ఒకరు మృతి చెందారు. తాండూరులో 72, వికారాబాద్‌లో 45, కులకచర్లలో 36, మర్పల్లిలో 25, దోమలో 17, యాలాల్‌లో 15, దౌల్తాబాద్‌లో 15, పరిగిలో 12, బొంరాస్‌పేట్‌లో 7,  పూడూరులో 6, పెద్దేముల్‌లో 6, బషీరాబాద్‌లో 5, ధారూరులో 3, కొడంగల్‌లో 2, మోమిన్‌పేట్‌లో 2, నవాబ్‌పేట్‌లో 2, బంట్వారంలో 2 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాండూరు మండలంలోని ఎల్మకన్నె గ్రామంలో ఏకంగా 23 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కాగా, వికారాబాద్‌ పట్టణంలోని గాంధీ కాలనీలో ఓ వద్దుడు కరోనాతో మృతి చెందారు. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 5358 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదవగా, వాటిలో 1462 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇందులో 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, 1446 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇంత వరకు జిల్లాలో కరోనాతో చికిత్స తీసుకుని 3833 మంది రికవరీ కాగా, 63 మంది మృతి చెందారు. కాగా, సోమవారం జిల్లాలో 2645 మంది నుంచి స్వాబ్‌ నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా, 2373 మందికి నెగిటివ్‌ రాగా, 272 మందికి పాజిటివ్‌ వచ్చింది. జిల్లాలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 63 మందికి పెరిగింది. 

Updated Date - 2021-04-13T05:26:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising