ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామలింగేశ్వరాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు షురూ

ABN, First Publish Date - 2021-10-18T06:03:29+05:30

రామలింగేశ్వరాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు షురూ

ఆలయంలో పూజలు చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సంపేట, అక్టోబరు 17: ఆధ్యాత్మిక భావన ఉట్టి పడేలా మాధన్నపేట చెరువు కట్టపై ఆహ్లాదభరి త వాతావరణంలో నిర్మించిన రామలింగేశ్వ రాలయంలో విగ్రహ ప్రతి ష్ఠాపనోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో మహాగణపతి, సుబ్ర హ్మణ్యస్వామి, శివపార్వ తులు, నంది, నవగ్రహాలు, నాగేంద్రస్వామి, శివకోటి, ధ్వజశిఖరం, శివలింగం విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త దొడ్డ మోహన్‌రావు సుమారు రూ.2కోట్లు వెచ్చించి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆదివారం దొడ్డ మోహన్‌రావు, కుటుంబ సభ్యులు గరిపెల్లి వంద న-శశికుమార్‌, తేలుకుంట స్పందన-కిరణ్‌ కుమార్‌, కుమార్‌శ్రీవన్ష్‌, కుమారి శైన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాలుగు రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో ఆదివారం గణపతిపూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, అంకు రార్పణ, పంచగవ్య ప్రాశన, రుత్విక్‌వరణం, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, మండ పారాధన, గణపతిహోమం, జలాధివాసం, మండప హోమాలు, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాధన్నపేట సర్పం చ్‌ చంద్రమౌళి, ఎంపిటీసీ రాంబాబు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజినీ, జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్న తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-18T06:03:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising