ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ ప్లాన్ అదే.. అందుకే వరి వేయొదంటున్నారు: రాకేష్‌‌రెడ్డి

ABN, First Publish Date - 2021-12-21T00:02:06+05:30

వరి వేయకుంటే బీడు భూములుగా మారుతాయని అందుకే కేసీఆర్ వరి వద్దంటున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వరి వేయకుంటే బీడు భూములుగా మారుతాయని అందుకే కేసీఆర్ వరి వేయొదంటున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీడు భూములుగా ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చనే ప్లాన్‌తోనే కేసీఆర్ వరి మేయొదంటున్నారన్నారు. ధాన్యం కొంటామని కేంద్రం చెప్పుతుంటే మంత్రులు ఎందుకు ఢిల్లీ వెళ్లారని ప్రశ్నించారు. తెలంగాణలో చావు డప్పులు కొట్టడం, ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. వెంటనే ప్రధానికి క్షమపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేసిన వారి పైన డీజీపీ మహేందర్‌రెడ్డి కేస్‌లు పెట్టాలన్నారు. ప్రధాన మంత్రి దిష్టిబొమ్మలను దహనం చేస్తుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో రాజ్యాంగం ఉందా లేదా అని నిలదీశారు. రేపు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని రాకేష్‌‌రెడ్డి అన్నారు. 

Updated Date - 2021-12-21T00:02:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising