ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంచిని రాష్ట్రానికి... చెడును కేంద్రానికి ఆపాదించటం టీఆర్ఎస్‌కు అలవాటు: రాజాసింగ్

ABN, First Publish Date - 2021-10-23T18:28:09+05:30

ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజసింగ్‌ సవాల్ విసిరారు. పెట్రోల్‌పై రాష్ట్ర వాటా ఎంతో చెప్పటానికి కేటీఆర్ భయపడుతున్నాడని రాజసింగ్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్‌ సవాల్ విసిరారు. పెట్రోల్‌పై రాష్ట్ర వాటా ఎంతో చెప్పటానికి కేటీఆర్ భయపడుతున్నాడని రాజసింగ్ తెలిపారు. హైదరాబాద్ రోడ్లుపై తనతో కలిసి కేటీఆర్ ప్రయాణం చేయాలని రాజాసింగ్ సవాల్ విసిరారు. ట్విట్టర్, ఏసీ రూం నుంచి కేటీఆర్ బయటకు వచ్చి హైదరాబాద్ రోడ్లును చూడాలన్నారు. ప్రజలపై ప్రేముంటే ప్రెట్రోల్‌పై 41రూపాయల రాష్ట్ర పన్నును కేటీఆర్ ఎత్తివేయాలన్నారు. కేంద్రం నిధులతో మాత్రమే తెలంగాణలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మంచిని రాష్ట్రానికి... చెడును కేంద్రానికి ఆపాదించటం టీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందన్నారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్, కేటీఆర్‌లు అసత్యాలు మాత్రమే చెప్తున్నారన్నారు. చిన్న వర్షానికే హైదరాబాద్ మునిగిపోతోన్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. నిజాం‌ కాలం నాటి డ్రైనేజీ మీదనే ప్రభుత్వం ఆదారపడ్తోందని ఎమ్మెల్యే రాజసింగ్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-23T18:28:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising