ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలమూరు జిల్లా అంతటా వర్షం

ABN, First Publish Date - 2021-08-29T01:41:24+05:30

పాలమూరు జిల్లా అంతటా వర్షం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత, శనివారం మధ్యాహ్నం నుంచి మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం అర్ధరాత్రి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. శనివారం మధ్యాహ్నం నుంచి జల్లులు పడుతున్నాయి. వర్షానికి వాతావరణం మేఘావృతం కావడంతో పూర్తిగా చల్లబడింది. మహబూబ్‌నగర్‌, దేవరకద్ర నియోజకవర్గాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయిల్‌సాగర్‌కు వరద ఉధృతి పెరగడంతో 3 గేట్లు ఎత్తి 1050 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మహబూబ్‌నగర్‌ అర్బన్‌లో 39.1 మి.మీ., కోయిల్‌కొండలో 33.8 మి.మీ., గండ్వీడ్‌లో 28 మి.మీ. వర్షపాతం నమోదైంది. 


నారాయణపేట జిల్లాలో అత్యధికంగా మద్దూర్‌లో 35.2 మి.మీ., నారాయణపేటలో 14.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో 38.8 మిల్లీ మీటర్ల వర్షం కురువగా చారకొండ మండలంలో 33.6 మి.మీ. వర్షం నమోదైంది. వనపర్తి జిల్లా ఘనపురం మండలంలో 36.8 మిల్లీమీటర్ల వర్షం కురువగా చిన్నంబావిలో 14.0 మి.మీ., పెద్దమందడి మండలంలో 11.5 మి.మీ. వాన కురిసింది. శనివారం మధ్యాహ్నం చిన్నంబావి, వీపనగండ్ల మండలాలలో గంట పాటు వాన దంచికొట్టింది.

Updated Date - 2021-08-29T01:41:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising