ఏబీఎన్‌తో రఘురామ సతీమణి రమాదేవి ఏం చెప్పారంటే..
ABN, First Publish Date - 2021-05-17T01:31:55+05:30
జగన్ సర్కార్‌పై ఎంపీ రఘురామ రాజు సతీమణి రమాదేవి సంచలన ఆరోపణలు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడిన ఆమె
హైదరాబాద్: జగన్ సర్కార్‌పై ఎంపీ రఘురామ రాజు సతీమణి రమాదేవి సంచలన ఆరోపణలు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడిన ఆమె... పోలీసులు తన భర్తను బాగా కొట్టారని ఆరోపించారు. కోర్టు నిబంధనలు పట్టించుకోరా అని ఆమె ప్రశ్నించారు. రమేశ్ ఆస్పత్రికి తరలించాలని కోరితే.. పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ రోజు రాత్రి తన భర్తను చంపాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అసలేం జరుగుతోందో తనకు అర్థం కావడం లేదని, హత్యలు చేసేవారు రోడ్లపై తిరుగుతున్నారని.. ప్రజా సమస్యలపై ప్రశ్నించేవాళ్లని జైల్లో పెడతారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2021-05-17T01:31:55+05:30 IST