ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాక్షన్‌కు రియాక్షన్ వస్తుంది.. కేసీఆర్ గుర్తుంచుకోవాలి: రఘనందనరావు

ABN, First Publish Date - 2021-06-21T22:07:43+05:30

యాక్షన్కు రియాక్షన్ కూడా వస్తుందని ఈ విషయం సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘనందనరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: యాక్షన్‌కు రియాక్షన్ కూడా వస్తుందని ఈ విషయం సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘనందనరావు అన్నారు. సోమవారం  రఘనందనరావు మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి  సంస్కారహీనంగా మాట్లాడటం తెలంగాణ సమాజానికి సిగ్గుచేటన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేను ‌‌దుబ్బాక ఎమ్మెల్యే కూడా తిట్టగలడని కేసీఆర్‌ని ఎద్దేవా చేశారు. దుబ్బాక భయంతోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలకు బయలు దేరారన్నారు.తమ పీఠాలు కదులుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్పష్టంగా అర్థమవుతోందని రఘనందనరావు చెప్పారు.


ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకొస్తే నీటి పంపాకాలను తేల్చడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కేంద్రం నివేదికలు కోరితే రాష్ట్ర ప్రభుత్వం సాకులు చెప్తోందన్నారు. రైతుబంధు, రైతు వేదికలు, వైకుంఠధామాలను ప్రతిపక్షాలు వ్యతిరేకించకున్నా.. ముఖ్యమంత్రికి ఉలుకెందుకు? అని ప్రశ్నించారు. రైతు వేదికల నిర్మాణంలో కేంద్ర నిధులెంత? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులెంత కేసీఆర్‌ చెప్పరెందుకు?అని ప్రశ్నిచారు. సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కేసీఆర్ హయాంలో మాత్రమే వచ్చాయన్నారు. సంపన్నులకు రైతుబంధు వద్దన్న తమ సూచనకు కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు. ధాన్యం సేకరణలో పంజాబ్ మెదటి స్థానంలో ఉంటే.. తెలంగాణ ఉందని కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్తున్నారన్నారు. ధాన్యం కొనుగొలులో సీఎం కేసీఆర్ కమీషన్ ఏంజట్ మాత్రమేనని ఎమ్మెల్యే రఘనందనరావు పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-21T22:07:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising