ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రగతి భవన్‌లోపెద్ద పాలేరు

ABN, First Publish Date - 2021-03-04T05:20:41+05:30

ప్రగతి భవన్‌లోపెద్ద పాలేరు

మహబూబాబాద్‌లో మాట్లాడుతున్న రాణి రుద్రమరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘పల్లా’పై రాణి రుద్రమరెడ్డి ఫైర్‌

మహబూబాబాద్‌ టౌన్‌, మార్చి 3: పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరేళ్ల కాలంలో ప్రజలకు జవాబుదారీగా పని చేయకుండా ప్రగతిభవన్‌లో పెద్ద పాలేరుగా పని చేశారని వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ యువతెలంగాణ పార్టీ (వైటీపీ) ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలో బుధవారం బైక్‌ ర్యాలీ నిర్వహించి ప్రచారం చేపట్టారు. అనంతరం వర్తక సంఘం భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రుద్రమరెడ్డి మాట్లాడారు. ఉద్యోగాల భర్తీపై మంత్రి కేటీఆర్‌ కూడా సవాల్‌ విసిరి తర్వాత చర్చకు రాకుండ మస్తు ఉద్యోగాలిచ్చాం అంటూ బహిరంగ లేఖ రాశారని ఎద్దెవా చేశారు. కరోనా కాలంలో ప్రైవేట్‌ పాఠశాలలు మూసివేయడంతో అందులో పని చేస్తున్న ఆరు లక్షల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి సాయ పడాలని విజ్ఞప్తి చేస్తే పెడచెవిన పెట్టిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇప్పుడు ఏ మెఖం పెట్టుకుని ఓటు అడగడానికి వస్తున్నారో నిలదీయాలని పిలుపునిచ్చారు. 

ఉద్యోగాల భర్తీపై తప్పుడు లెక్కలు చూపిస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి చర్చకు రావాలని సవాల్‌ విసిరితే తోక ముడుచుకుని పోయారని, ఆనాడే మనం నైతికంగా టీఆర్‌ఎ్‌సపై విజయం సాధించామని పేర్కొన్నారు. తనను తెలంగాణ ఆడబిడ్డగా ఆశీర్వదిం చి గెలిపిస్తే పట్టభద్రులు, ఉద్యోగులు, మేధావులు, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా జవాబుదారీగా పని చేస్తానని స్పష్టం చేశారు. విష్ణు, రాజేశ్వర్‌, సత్యనారాయణ, శ్యాంప్రసాద్‌, బద్రినారాయణ, లక్ష్మణ్‌, రంజిత్‌, కళింగరెడ్డి పాల్గొన్నారు.

డోర్నకల్‌లో..

డోర్నకల్‌ : యువ తెలంగాణ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి  డోర్నకల్‌లో ప్రచారం నిర్వహించారు. స్థాని క తహసీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. జడ్పీ హైస్కూల్‌ చేరుకుని ఉపాధ్యాయులను తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు.

 

Updated Date - 2021-03-04T05:20:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising