ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్లుండి టోక్యో నుంచి ఢిల్లీకి PV Sindhu

ABN, First Publish Date - 2021-08-02T02:47:34+05:30

ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతకం సాధించి రికార్డుకెక్కింది. సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. 26 ఏళ్ల సింధు ఒలింపిక్స్‌ సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు సాధించిన నాలుగో క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. కాగా.. ఈ నెల 3న టోక్యో నుంచి ఢిల్లీకి సింధు రానుంది. సింధు గెలుపు అనంతరం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ఆమె తండ్రి పీవీ రమణ ప్రత్యేకంగా మాట్లాడారు. 


రెండు ఒలింపిక్స్ క్రీడల్లో దేశానికి పతకాన్ని తెచ్చిపెట్టిన తొలి క్రీడాకారణి సింధు అవడం తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు. సింధును రిసీవ్ చేసుకోవటానికి కుటుంబ సభ్యులందరం ఢిల్లీకి వెళ్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారం మరువలేనిదని ఆయన చెప్పుకొచ్చారు. ఢిల్లీలో బాయ్ అధికారులు, కేంద్ర పెద్దలకు కుటుంబ సభ్యులతో కలిసి సింధు కృతజ్ఞతలు తెలపనున్నది. అనంతరం ఢిల్లీ నుంచి అదే రోజు సాయంత్రం హైదరాబాద్ రానున్నట్లు తెలియవచ్చింది.

Updated Date - 2021-08-02T02:47:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising