ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీవీ కుటుంబం దేశ సేవకే అంకితం

ABN, First Publish Date - 2021-01-17T04:35:16+05:30

పీవీ కుటుంబం దేశ సేవకే అంకితం

వంగరలో పీవీ విగ్రహానికి పూలమాల వేస్తున్న కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ 


భీమదేవరపల్లి, జనవరి 16: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుతో పాటు ఆయన కుటుంబం మొత్తం దేశసేవకే అంకితమయ్యారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. వంగరలో శనివారం పీవీ ఇంటిని ఆయన సందర్శించి పీవీ చిత్రపటానికి నివాళులర్పించారు. వంగరలోని పీవీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. దేశానికి దిశా నిర్దేశం చేసిన మహనీయుడు పీవీ నర్సింహారావు అని కొనియాడారు. ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ మాట్లాడుతూ.. శతజయంతి ఉత్సవాల సందర్భంగా వంగరలో రూ.పది కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందన్నారు. డీఎంఎ్‌ఫటీ పథకం కింద సమ్మక్క బోటి నుంచి వంగరలోని పీవీ ఇంటి వరకు డబుల్‌ రోడ్డు కోసం రూ.7కోట్లు, అలాగే పీవీ స్మృతివనం ఏర్పాటు కోసం రూ.3కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, జడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌, పీవీ కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-17T04:35:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising