ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీవీ తెలంగాణ వాడు కావడం మనకు గర్వకారణం

ABN, First Publish Date - 2021-12-23T20:41:00+05:30

దివంగత మాజీ ప్రధాని పీవీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీ లోని అంబేద్కర్ హాలులో పలువురు తెలంగాణ నాయకులు పీవీకి ఘనంగా నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని పీవీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీ లోని అంబేద్కర్ హాలులో పలువురు తెలంగాణ నాయకులు పీవీకి ఘనంగా నివాళులర్పించారు.రాష్ట్ర మంత్రులు, ఎంపీ లతో కలిసి పలువురునాయకులు పీవీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే, ఎంపీ లు బండా ప్రకాశ్, సురేశ్ రెడ్డి, బడుగుల లింగయ్య, డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, మన్నే శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ నేత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఒకే ఒక్క తెలుగు వాడు పీవీ అని,ఆయన తెలంగాణ వాడు కావడం మనకు గర్వకారణమని అన్నారు.పీవీ మేధావి, బహుభాషావేత్త,  అపార జ్ఞానం ఉన్నవాడని, రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరు పొందారన్నారు.తన భూములను పేదలకు పంచి నాడు ఉమ్మడి రాష్ట్రంలో భూ సంస్కరణలకు బీజం వేసిన భూ ధాత పీవీ అని కొనియాడారు. పీవీ వరంగల్ లోనే చదువుకున్నారని,జర్నలిస్టుగా తన జీవితాన్నిమొదలు పెట్టి, కాకతీయ పత్రిక నడిపి, బహు భాషలు నేర్చి, రాజకీయాల్లో చేరి, అనేక పదవులు అలంకరించారని గుర్తు చేశారు. 

Updated Date - 2021-12-23T20:41:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising