ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాద్రిలో ముగిసిన పునర్వసు దీక్షల విరమణ

ABN, First Publish Date - 2021-12-21T17:30:35+05:30

భద్రాద్రిలో శ్రీరామ పునర్వసు దీక్షల విరమణ కార్యక్రమం ముగిసింది. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో శ్రీరామ పునర్వసు దీక్షలను శ్రీ రామ దీక్షితులు విరమించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం : భద్రాద్రిలో శ్రీరామ పునర్వసు దీక్షల విరమణ కార్యక్రమం ముగిసింది. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో శ్రీరామ పునర్వసు దీక్షలను శ్రీ రామ దీక్షితులు విరమించారు. 27 రోజులపాటు భక్తిప్రపత్తులతో శ్రీరామ పునర్వసు దీక్షలు పూర్తి చేసుకుని  మంగళవారం తెల్లవారు జామున గోదావరి నది స్నానాలు ఆచరించారు. ఈ క్రమంలోనే శ్రీ రామ దీక్షితులు స్వామివారి ఇరుముడులతో ఆలయానికి చేరుకున్నారు. ఈ సమయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భద్రాద్రి దేవస్థానం ఈవో బి శివాజీ శ్రీరామ పాదుకలను శిరస్సుపై పెట్టుకుని ఆలయ వైదిక పరిపాలన సిబ్బంది, శ్రీ రామ దీక్షితులు స్వామివారి పాదుకలతో, మేళతాళాలతో రామనామ స్మరణలతో ఆలయ గిరిప్రదక్షిణ గావించారు. అనంతరం భద్రుని కోవెల వద్ద శ్రీ రామ దీక్షితులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఇరుముడులు స్వామివారికి సమర్పించి అర్చకుల సమక్షంలో విరమణ చేశారు. రామభక్తులకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా శ్రీరామ దీక్షితుల కోసం రాత్రి శ్రీ సీతా రామచంద్ర స్వామి వారికి వెండి రథ సేవ నిర్వహించారు. కాగా శ్రీరామ దీక్షితుల కోసం బుధవారం నాడు పట్టాభిషేకం నిర్వహించనున్నారు.


Updated Date - 2021-12-21T17:30:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising