కోకాపేట్ భూములు: రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు
ABN, First Publish Date - 2021-06-26T23:42:00+05:30
కోకాపేట్ భూముల పేరుతో ప్రైవేటు ప్రకటనలు రావడంతో సైబరాబాద్ పోలీస్కమిషనర్కు
హైదరాబాద్: కోకాపేట్ భూముల పేరుతో ప్రైవేటు ప్రకటనలు రావడంతో సైబరాబాద్ పోలీస్కమిషనర్కు హెచ్ఎండీఏ ఫిర్యాదు చేసింది. ప్రజలను మోసం చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోకాపేట్ భూముల పేరుతో వచ్చే ప్రైవేటు ప్రకటనలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు హెచ్ఎండీఏ విజ్ఞప్తి చేసింది. ఈ మధ్యనే కోకాపేట్ భూముల ప్రీ ఆక్షన్ బిడ్ మీటింగ్ జరిగింది.
Updated Date - 2021-06-26T23:42:00+05:30 IST