ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వానాకాలం ఎరువులు సిద్ధం: నిరంజన్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-05-20T07:38:35+05:30

వానాకాలంలో సాగు కోసం అన్ని జిల్లాల్లో ఎరువులు అం దుబాటులో ఉంచామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 19(ఆంధ్రజ్యోతి): వానాకాలంలో సాగు కోసం అన్ని జిల్లాల్లో ఎరువులు అం దుబాటులో ఉంచామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఆశాజనకంగానే ఎరువుల నిల్వలున్నాయన్నారు. వానాకాలంలో ఎరువుల సరఫరాపై బుధవారం హైదరాబాద్‌లో అధికారులు, కంపెనీల ప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్క్‌ఫెడ్‌ వద్ద 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువుల నిల్వలు పెట్టబోతున్నామని, ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు కూడా ఎరువులను పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు. ఎరువుల నిల్వ కోసం అందుబాటులో ఉన్న గోదాములన్నింటినీ వినియోగించుకోవాలన్నారు. వానాకాలం రాకముందే రైల్వే రేక్‌ పాయింట్ల నుంచి డిమాండ్‌కు అనుగుణంగా జిల్లాలకు ఎరువులు పంపించాలని ఆయన సూచించారు. సమీక్షలో మార్క్‌ఫెడ్‌ ఎండీ యాదిరెడ్డి, అగ్రోస్‌ ఎండీ రాములు, ఎన్‌ఎ్‌ఫసీఎల్‌, క్రిభ్‌కో, స్పిక్‌ తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-20T07:38:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising