ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పాక్‌లో నన్ను మతం మారమన్నారు.. శివుణ్ణి ప్రార్థిస్తానని చెప్పా’

ABN, First Publish Date - 2021-06-02T19:24:08+05:30

హైదరాబాద్: పాకిస్థాన్‌లోకి అక్రమంగా చొరబడి అక్కడి భద్రతా దళాలకు చిక్కి.. అక్కడి జైలులో మగ్గి తాజాగా విడుదలైన ప్రశాంత్ మీడియాతో పాక్ జైల్లో తనకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పాకిస్థాన్‌లోకి అక్రమంగా చొరబడి అక్కడి భద్రతా దళాలకు చిక్కి.. అక్కడి జైలులో మగ్గి తాజాగా విడుదలైన ప్రశాంత్ మీడియాతో పాక్ జైల్లో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు. పాక్ బోర్డర్‌లో అయితే తననెవరూ పట్టుకోలేదని బోర్డర్ దాటి వెళుతుంటే హైవే ప్యాట్రోల్ వాహనం వాళ్లు తనను పట్టుకున్నారని వెల్లడించాడు. ఇంకా ప్రశాంత్ మాట్లాడుతూ.. ‘‘నేను మళ్ళీ మా అమ్మ, నాన్నలను కలుస్తానని అస్సలు అనుకోలేదు. భారత ప్రభుత్వం సహాయం చేయబట్టే నేను ఇంత వేగంగా ఇంటికి చేరుకోగలిగాను. నాలాగే వెళ్లి పాకిస్తాన్‌లో ఇరుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.


అక్కడ చిక్కుక్కున్న భారతీయుల పేర్లను నేను ప్రభుత్వానికి ఇచ్చాను. కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌లో నాలాగా చిక్కుక్కున్న మిగతా వారిని కూడా భారత్‌కి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలి అని కోరుకుంటున్నా. కొంతమంది శిక్ష పూర్తయినా ఇంకా ఎంబసీలోనే క్లియరెన్సీ కోసం వేచి చూస్తున్నారు. ఇండియా, పాకిస్తాన్ బోర్డర్‌లో నన్ను ఎవరూ పట్టుకోలేదు. పాకిస్తాన్ బోర్డర్ దాటి నడుచుకుంటూ వెళ్తుంటే హైవే ప్యాట్రోల్ వాహనం వాళ్ళు రెండోవ రోజు నన్ను పట్టుకున్నారు. పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన తరవాత నేను ఎడారిలో 40 కిలో మీటర్లు నడిచాను. పాకిస్థాన్ భద్రత సిబ్బంది మానవత్వం చూపారు. పాకిస్థాన్ జైల్లో ఏ భారత ఖైదీలతో పని చేయించరు. పాకిస్థాన్‌లో ఉన్న ఖైదీలను ముస్లింలుగా మారమని అడుగుతారు. నేను మారనని శివుణ్ణి ప్రార్థిస్తానని చెప్పాను. దేశం కోసం, పాకిస్థాన్ కోసం ప్రార్థనలు చేశాను. నేను భావల్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నాను. నాతో పాటు జైల్ సెల్‌లో ఇంకొకరు ఉండే వారు. మళ్లీ నేను ఓ మంచి సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడతా. దానికోసం జైల్లోనే కొన్ని పుస్తకాలు చదివాను’’ అని ప్రశాంత్ వెల్లడించాడు. 


Updated Date - 2021-06-02T19:24:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising