ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు, రేపు ‘ప్రరవే’ వార్షిక సదస్సు

ABN, First Publish Date - 2021-03-07T05:08:40+05:30

నేడు, రేపు ‘ప్రరవే’ వార్షిక సదస్సు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివిధ అంశాలపై ప్రసంగించనున్న ప్రముఖులు

కీలకోపన్యాసం చేయనున్న అల్లం రాజయ్య  


వరంగల్‌ కల్చరల్‌, మార్చి 6: ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) ఆరో వార్షిక సదస్సు ఈ నెల 7,8వ తేదీల్లో హన్మకొండలోని పింగిళి ప్రభుత్వ మహి ళా కళాశాల ఆడిటోరియంలో జరగనుంది. రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో మూడు నెలలుగా ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో ‘తెలు గు సాహిత్యం - రైతాంగ సమస్యలు’ అనే అంశంపై పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల పూర్వవిద్యార్థుల సంఘంతో కలిసి ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

రైతుల ఆందోళనకు కారణమైన కొత్త వ్యవసాయ చట్టాల పూర్వచరిత్ర, దానికి వర్తమానంతో ఉన్న అనుబంధాన్ని అధ్యయనం చేయాలన్న ఉద్దేశంతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ప్రముఖ రచయిత అల్లం రాజయ్య కీలకోపన్యాసం చేస్తారు. అంపశయ్య నవీన్‌, జహాఆరా, జి.చంద్రకళ, లంకా పాపిరెడ్డి, వంగాల సం పత్‌ రెడ్డి, గోపరాజు సుధ, కోడం కుమారస్వామి, స్వే చ్ఛ, కేఎన్‌ మల్లీశ్వరి, వంగపల్లి పద్మ, సిద్దాబత్తుల ఆశాలత తదితర ప్రముఖులు ఈ సదస్సులో ప్రసంగించనున్నారని ప్రరవే జాతీయ కార్యదర్శి కాత్యాయనీ విద్మహే, తెలంగాణ కార్యదర్శి కొమర్రాజు రామలక్ష్మి ఒ క ప్రకటనలో తెలిపారు. అంపశయ్య నవీన్‌ క్షేత్ర పర్యటనల పుస్తకాన్ని ఈ సదస్సులో ఆవిష్కరించనున్నారు. ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుంది. 


మొదటి రోజు..

ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వ రకు ప్రరవే తెలంగాణ అధ్యక్షురాలు తిరునగరి శ్రీదేవి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ‘భారతదేశ వ్య వసాయ విధానాలు, చట్టాలు, ఆచరణ పరిణామాలు -1947, 1965’ అనే అంశంపై జహారా, ‘1947-1965 మ ధ్య తెలుగు సాహిత్యం-రైతాంగ సమస్యల ప్రతిఫల నం’ అనే అంశంపై  గుత్తికొండ చంద్రకళ ప్రసంగిస్తా రు. మందరపు హైమవతి సమన్వయకర్తగా ఉంటారు.  

మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రరవే ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి ఎండ్లూరి మానస అధ్యక్షతన జరిగే రెండో సమావేశంలో ‘హరిత విప్లవం-పరిణామాలు 1966-1990’ అనే అంశంపై లంకా పాపిరెడ్డి, ‘తెలుగు సాహిత్యంలో హరిత విప్లవ పరిణామాల ప్రతిఫలనం’పై వంగాల సంపత్‌ రెడ్డి ప్రసంగిస్తారు. మెస్‌ నీలాదేవి నిర్వహణలో ఈ సెషన్‌ జరుగుతుంది. 

సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు  కొమర్రాజు రామలక్ష్మి అధ్యక్షతన జరిగే మూడో సమావేశంలో ‘నూతన ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో వ్యవసాయ సంక్షోభాలు- మహిళలు-1991-2020’ పై గోపరాజు సుధ, ‘తెలుగు సాహిత్యం-నూతన ఆర్థిక సంస్కరణల భిన్నపార్శ్వాలు’ అనే అంశంపై కోడం కుమారస్వామి ప్రసంగిస్తారు. అమరజ్యోతి నిర్వాహకురాలుగా వ్యవహరిస్తారు. సాయంత్రం 5.45 నుంచి 7 గంటల మధ్య సర్వసభ్య సమావేశం జరుగుతుంది.


రెండో రోజు..

సోమవారం ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు నల్లూరి రుక్మిణి అధ్యక్షతన జరిగే నాలుగో సమావేశంలో ‘మహిళా రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ ఆధారిత వృత్తిదారుల జీవిత సమస్యలు అనే అంశంపై స్వేచ్ఛ ప్రసంగిస్తారు. అలాగే ‘తెలుగు సాహిత్యంలో మహిళా రైతులు, రైతు కూలీలు, వ్యవసాయాధారిత వృత్తికారుల జీవితం’పై కేఎన్‌ మల్లీశ్వరి మాట్లాడతారు. నల్ల యామిని నిర్వహణలో ఈ సెషన్‌ జరుగుతంది. 

ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు అనిశెట్టి అధ్యక్షతన జరిగే ఐదో సమావేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘సమానత్వ భవిష్యత్తు నిర్మాణానికి స్త్రీ నాయకత్వం’పై వంగపల్లి పద్మ ప్రసంగిస్తారు. నిర్వాహకురాలుగా కనీజ్‌ ఫాతిమా వ్యవహరిస్తారు. మధ్యాహ్నం 2.15 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ముగింపు సమావేశం జరుగుతుంది. ప్రరవే జాతీయ సమన్వయకర్త వి.శాంతి ప్రబోధ అధ్యక్షత వహిస్తారు. ‘వర్తమాన రైతు ఉద్యమ సవాళ్లు-మహిళలు’ అనే అంశంపై సిద్దాబత్తుల ఆశాలత సమాపన ప్రసంగం చేస్తారు.  రెహానా సదస్సు నివేదిక సమర్పిస్తారు. డాక్టర్‌ జి.రాజారెడ్డి  ముఖ్యఅతిఽథిగా హాజరవుతారు. 

Updated Date - 2021-03-07T05:08:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising