పీఎంజీఏవైని తెలంగాణ అమలు చేయడం లేదు
ABN, First Publish Date - 2021-07-21T09:03:27+05:30
ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (పీఎంజీఏవై) పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్...
- బండి సంజయ్ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (పీఎంజీఏవై) పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి తెలిపారు. 2016-17లో ఈ పథకం కింద విడుదల చేసిన రూ.190.78 కోట్లను ఈ కారణంగా తిరిగి ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామని ఆమె వెల్లడించారు. మంగళవారం లోక్‌సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆమె లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Updated Date - 2021-07-21T09:03:27+05:30 IST