ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యభిచార గృహంపై దాడులు

ABN, First Publish Date - 2022-01-01T05:14:46+05:30

వ్యభిచార గృహంపై దాడులు

నిర్వాహకులు, విటుడిని అరెస్టు చూపిస్తున్న ఏసీపీ జితేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ క్రైం, డిసెంబరు 31: వరంగల్‌ పో లీసు కమిషనరేట్‌ హనుమకొండ పోలీసుస్టేషన్‌ పరి ధిలోని రెడ్డికాలనీలో పట్టపగలే వ్యభిచారం చేస్తున్న ముఠాను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నగదుతో పాటు సెల్‌ఫోన్లు, ద్విచక్రవా హనం స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం హనుమ కొండ పీఎస్‌లో ఏసీపీ జితేందర్‌రెడ్డి ఇద్దరు నిర్వాహ కులను, ఒక విటుడిని అరెస్టు చూపించి వివరాలను వెల్లడించారు. 

హనుమకొండ గుండ్లసింగారం గ్రామానికి చెందిన గరికపాటి పద్మ ఆలియాస్‌ పద్మావతి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన నోముల రమలు కూర గాయల మార్కెట్‌లో కూరగాయలు విక్రయిస్తుండే వారు. వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో వ్యభిచార గృహం నిర్వహించి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. రెడ్డి కాలనీలో రోడ్‌ నెంబర్‌-2లో ఓ ఇంటిని అద్దెకు తీసు కుని వ్యభిచారం నిర్వహిస్తుండేవారు. ఇతర ప్రాంతా ల నుంచి మహిళలను తీసుకువచ్చి పరిచయం ఉన్న వ్యక్తులతో వ్యభిచారం చేయించేవారు. ఈ క్రమంలో రెడ్డికాలనీలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్టు హ నుమకొండ సీఐ వేణుమాధవ్‌కు పక్కా సమాచారం అందింది. దీంతో గురువారం రాత్రి దాడులు నిర్వ హించారు. హనుమకొండకు చెందిన బలుగు రాజు వద్ద డబ్బులు తీసుకుని హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఓ మహిళను వ్యభిచారం చేయేంచేందుకు గదిలోకి పంపించారు. వెంటనే పోలీసులు ఇంటిపై దాడి చేసి ఇద్దరు నిర్వాహకులు పద్మ, రమలతో పాటు విటుడు రాజు మరో మహిళను అరెస్టు చేశారు. గదిలో వాడి పడేసిన కండోమ్స్‌ రూ.3వేల నగదు, 4సెల్‌ఫోన్స్‌ ఒక ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ వెల్లడించారు. వారిని విచారించగా సంవత్సరం కాలంగా వ్యభిచారం చేస్తున్నట్టు వెల్లడించారు. ఇద్దరు మహిళలు, విటుడిపై కేసు నమోదు చేసి రిమాండు కు తరలించినట్టు వెల్లడించారు. ఈ దాడులలో హను మకొండ సీఐ వేణుగోపాల్‌, ఎస్‌ఐ రాజ్‌కుమార్‌లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-01T05:14:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising