ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి, గుట్కా నిల్వలపై పోలీసుల ఉక్కుపాదం

ABN, First Publish Date - 2021-10-24T00:53:20+05:30

గంజాయి సాగుపై, నిల్వలపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గంజాయి సాగుపై, నిల్వలపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా దాడులు  నిర్వహిస్తున్నారు.  నగరంలోని గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలోని నానక్‌రామ్‌గుడాలో గంజాయిని విక్రయిస్తున్న సింగ్‌ అనే వ్యక్తి పోలీసులు అరెస్ట్‌ చేసారు. అతని వద్ద 1.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ పీఎస్‌ పరిధిలో గంజాయిని విక్రయిస్తున్న తేజ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు.  అతని వద్ద నుంచి 655 గ్రాముల లిక్విడ్ గంజాయి, 14 గంజాయి టాబ్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోగల పలు పాన్ షాప్‌లు , కిరాణా దుకాణాలలో భారీ  పోలీస్ సిబ్బందితో , అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిషేధిత గుట్కాలు , పలు నిషేధిత వస్తువులను గుర్తించే పనిలో  పోలీసులు ఈ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అలాగే  నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఏఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాల మేరకు గుట్కా పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పట్టణ  సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 7 బృందాలుగా ఏర్పడి పలు కిరాణా పాన్ షాప్‌లపై దాడులు చేసారు. 40వేల  నిషేధిత గుట్కాలను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-24T00:53:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising