ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిజియోథెరఫిస్ట్‌ దుర్మరణం

ABN, First Publish Date - 2021-06-09T13:10:18+05:30

కొవిడ్‌ బాధితుడికి చికిత్స అందించేందుకు వెళ్తున్న ఫిజియోథెరఫిస్ట్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/అఫ్జల్‌గంజ్‌: కొవిడ్‌ బాధితుడికి చికిత్స అందించేందుకు వెళ్తున్న ఫిజియోథెరఫిస్ట్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పుగూడ నరహరినగర్‌ నివాసి అవినాశ్‌ (31) ఫిజియోథెరఫిస్ట్‌. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు బైక్‌పై శివాజీ ప్రతిమ వంతెనపై వెళ్తున్నాడు. వెనుక నుంచి ఆర్టీసీ బస్సు అతడిని ఢీ కొట్టింది. బస్సు చక్రాలు అతనిపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే డాక్టర్‌ మృత్యువాత పడ్డారని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. బస్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అవినాశ్‌కు రెండేళ్ల క్రితమే పెళ్లి అయింది. అతడి భార్య ప్రస్తుతం గర్భవతి. బిడ్డను కళ్లారాచూడకుండానే అతడు మృతి చెందడంతో నరహరినగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.. 

Updated Date - 2021-06-09T13:10:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising