ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బతుకమ్మ వేడుకల్లో అపశ్రుతి

ABN, First Publish Date - 2021-10-17T06:40:44+05:30

బతుకమ్మ వేడుకల్లో అపశ్రుతి

పెంటయ్య మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెరువులో పడి ఒకరి మృతి

కాటారం(మహాముత్తారం), అక్టోబరు 16: బతుకమ్మ వేడుకల్లో శుక్రవారం తెల్లవారుజాము అపశ్రుతి చోటు చేసుకుంది. నిమజ్జనం సంద ర్భంగా ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. జయశంకర్‌ భూపాల పల్లి జిల్లా మహాము త్తారం మండలం కేంద్రంలోని నేతకానిపల్లిలో ఈ సంఘ టన చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నేతకానిపల్లిలో మహిళలు శక్రవారం తెల్లవా రుజాము వరకు బతుకమ్మ ఆడారు. ఈ క్రమంలో తమ కుటుంబంలోని మహిళలు ఆడిన బతుకమ్మను నిమజ్జనం చేయడానికి పెంటయ్య (65) అనే వ్యక్తి చెరువులోకి పట్టుకెళ్లాడు. అప్పటికే పలువురు గ్రామస్థులు ఇళ్లకు తిరి వెళ్లిపోయారు. పెంటయ్య చివరిగా వెళ్లి చెరువులో దిగి బతుకమ్మను నిమజ్జనం చేయడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పెద్దగొయ్యిలో పడి మునిగిపోయాడు. ఉదయం పెంటయ్య ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు గ్రామస్థులకు తెలియజేయగా వారంతా చెరువు వద్దకు వెళ్లి అందులో వెతికారు. చివరకు పెంటయ్య మృతదేహం చెరువులో లభ్యమైంది.  దీంతో ఆ ఇంట పండుగ పూట విషాదం నెలకొంది.  


Updated Date - 2021-10-17T06:40:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising