ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ నర్సు కొంపముంచిన ‘బుల్లెట్‌ బండి’ పాట డాన్స్

ABN, First Publish Date - 2021-08-22T00:12:34+05:30

బుల్లెట్‌ బండెక్కి వచ్చేస్తా’ అనే జానపద పాటకు డ్యాన్స్‌ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ స్టాఫ్‌నర్సు వివాదాల్లో చిక్కుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల: ‘బుల్లెట్‌ బండెక్కి వచ్చేస్తా’ అనే జానపద పాటకు డ్యాన్స్‌ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ స్టాఫ్‌నర్సు వివాదాల్లో చిక్కుకుంది. మంచిర్యాల జిల్లాలో నవవధువు సాయిశ్రేయ చేసిన డ్యాన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. ‘బుల్లెట్‌ బండి’ పాట నాలుగైదు రోజులుగా ట్రెండిగ్‌గా హాల్‌చల్‌ చేస్తోంది. ఇదే పాటపై తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వాతంత్య్ర వేడుకలరోజు ఓ నర్సు సరదాగా చేసిన డ్యాన్స్‌ మరోసారి వైరల్‌గా మారింది. తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వాతంత్య్ర వేడుకలు ముగిసిన తరువాత కారిడార్‌లో రజని అనే స్టాఫ్‌నర్సు సరదాగా బుల్లెట్‌ బండి పాటపై డ్యాన్స్‌ చేయడం వివాదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో తమ ఫ్రెండ్స్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశారు. అది ఇతర గ్రూపుల్లోకి చేరడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వ ఆసుపత్రిలో డాన్స్‌ చేయడం వివాదంగా మారింది. దీనిపై స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శనివారం డాన్స్‌ చేసిన స్టాఫ్‌ నర్స్‌కు మోమో జారీ చేశారు. కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఆసుపత్రిలో డ్యాన్స్‌ చేయడం అనేక విమర్శలకు దారి తీస్తోంది. 

Updated Date - 2021-08-22T00:12:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising