ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్‌: జనార్దన్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-05-20T21:27:53+05:30

ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నియామకాలు చేపడుతామని తెలిపారు. ఉద్యోగాల నియామకంలో పారదర్శకంగా ఉంటామని స్పష్టం చేశారు. నిరుద్యోగులు అధైర్యపడొద్దని జనార్దన్‌రెడ్డి సూచించారు. గతంలో వివిధ జిల్లాల కలెక్టర్‌గా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా.. ప్రజల సమస్యలను దగ్గరగా చూశామని జనార్దన్‌రెడ్డి చెప్పారు. 


తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)కు పూర్తిస్థాయి చైర్మన్‌తో పాటు సభ్యులను ప్రభుత్వం ఎట్టకేలకు నియమించింది. చైర్మన్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి నియమితులయ్యారు. చైర్మన్‌తో పాటు ఏడుగురు సభ్యులను సీఎం కేసీఆర్‌ బుధవారం నియమించారు. సీఎం  ప్రతిపాదనలను గవర్నర్‌ తమిళిసై ఆమోదించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌.. చైర్మన్‌, సభ్యుల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. చైర్మన్‌తో పాటు సభ్యులంతా ఆరేళ్లు లేదా 62 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-20T21:27:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising