ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైళ్లలో వెయిటింగ్‌ లిస్టు ప్రయాణాలకు నో

ABN, First Publish Date - 2021-05-07T09:47:59+05:30

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత కోసం భారతీయ రైల్వే కొవిడ్‌ మార్గదర్శకాలను జారీ చేసింది. వెయిటింగ్‌ లిస్టులో ఉన్న ప్రయాణికులను రైళ్లలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రీ పెయిడ్‌ కేటరింగ్‌ సౌకర్యం ఉండదు


హైదరాబాద్‌, మే 6(ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత కోసం భారతీయ రైల్వే కొవిడ్‌ మార్గదర్శకాలను జారీ చేసింది. వెయిటింగ్‌ లిస్టులో ఉన్న ప్రయాణికులను రైళ్లలో ప్రయాణించడానికి అనుమతించొద్దని అన్ని జోన్లను ఆదేశించింది. జరిమానా వసూలు చేసి రైళ్లలో టికెట్లు ఇచ్చే విధానాన్ని కూడా నిలిపివేసింది. అయితే.. అన్‌రిజర్వుడు టికెట్లు ఉన్న ప్రయాణికులను అన్‌రిజర్వుడు కోచ్‌లు ఉన్న రైళ్లలోకి మాత్రమే అనుమతించాలని సూచించింది. టికెట్‌ చార్జీతో కలిపి భోజన రుసుము(ప్రీ పెయిడ్‌ కేటరింగ్‌)ను వసూలు చేసే సౌకర్యం ఉండబోదని తెలిపింది.


రెడీ టు ఈట్‌ భోజనం, ప్యాక్‌ చేసిన ఐటెమ్స్‌(వాటర్‌ బాటిళ్లతో కలిపి) మాత్రం రైళ్లలో అందుబాటులో ఉంటాయని వివరించింది. ఐఆర్‌సీటీసీ ద్వారా ఈ-కేటరింగ్‌ సౌకర్యం ఉంటుందని తెలిపింది. రైళ్లలో ప్రయాణికులకు లెనిన్‌ దుప్పట్లు, కర్టెన్లు ఇవ్వడం కుదరదని, వీటిని ప్రయాణికులు సొంతంగా తెచ్చుకోవాలని లేదా స్టేషన్లలోని స్టాళ్లలో కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. థర్మల్‌ స్ర్కీనింగ్‌లో కొవిడ్‌ లక్షణాలు లేనట్లు తేలితేనే ప్రయాణాలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. 

Updated Date - 2021-05-07T09:47:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising