ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగసంఘాలకు నో ఎంట్రీ!

ABN, First Publish Date - 2021-01-16T08:46:20+05:30

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు శుక్రవారం సచివాలయంలో చేదు అనుభవం ఎదురైంది. పీఆర్సీ, పదోన్నతులకు సంబంధించి ముఖ్యమంత్రి హామీలను అమలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలిసేందుకు నిరాకరించిన సీఎస్‌..

సచివాలయంలో చేదు అనుభవం

ఇన్‌వార్డులో వినతిపత్రమిచ్చి వె నుదిరిగిన ఐక్యవేదిక నేతలు..

23న దీక్ష చేపడతామని ప్రకటన


హైదరాబాద్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు శుక్రవారం సచివాలయంలో చేదు అనుభవం ఎదురైంది. పీఆర్సీ, పదోన్నతులకు సంబంధించి ముఖ్యమంత్రి హామీలను అమలు చేయాలని కోరేందుకు వెళ్లిన సంఘాల నేతలను కలిసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నిరాకరించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్‌ సెక్టార్‌, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధులు అక్కడికి వెళ్లగా.. అపాయింట్‌మెంట్‌ లేకుండా వస్తే కలవడం కుదరదని సీఎస్‌ తేల్చి చెప్పారు. అయితే తాము 4 గంటలకు వస్తామని, తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాల్సిందిగా మధ్యాహ్నం ఒంటి గంటకే సమాచారం ఇచ్చామని సంఘాల నేతలు చెప్పారు. అయినా వారిని కలిసేందుకు సీఎస్‌ నిరాకరించడంతో ఇన్‌వార్డులో వినతిపత్రం ఇచ్చి వెనుదిరిగారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న ధర్నాచౌక్‌ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు. వేతన సవరణ, పదోన్నతులపై సమాధానం చెప్పలేకనే సీఎస్‌ మొహం చాటేశారని ఆక్షేపించారు. పీఆర్సీ అమలు కోసం 30 నెలలుగా ఎదురుచూస్తున్నామని, వేతన సవరణ కమిషన్‌ డిసెంబరు 31నే నివేదికను ప్రభుత్వానికి అందించించినా.. ఇప్పటిదాకా బహిర్గత పరచలేదని తప్పుబట్టారు. ఇతర హామీల అమలుపైనా నిర్ధిష్టమైన ఉత్తర్వులే వెలువడలేదన్నారు.


ఈ నెల 6, 7వ తేదీల్లో సంఘాలతో చర్చలు జరపాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించినా.. అధికారులు ఎందుకు సమావేశం కావడంలేదని ప్రశ్నించారు. ఈ విషయంపై రోజుకో రకంగా జరుగుతున్న ప్రచారంతో క్షేత్ర స్థాయిలో గందరగోళం నెలకొంటోందని తెలిపారు. పీఆర్సీ సత్వర అమలు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 23న ఐక్యవేదిక రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యులు హైదరాబాద్‌ ధర్నాచౌక్‌ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అదే రోజు జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలు, మండ ల కేంద్రాలు, విద్యాసంస్థల్లో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే ఫిబ్రవరి 15 లోపు ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామన్నారు. 

Updated Date - 2021-01-16T08:46:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising