ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలేవీ?:హైకోర్టు

ABN, First Publish Date - 2021-04-16T09:27:43+05:30

శతాబ్దాల చరిత్ర కలిగిన గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ సమాధుల పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శతాబ్దాల చరిత్ర కలిగిన గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ సమాధుల పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పురాతన కట్టడాల అభివృద్ధికి ప్రణాళిక ఏదని ప్రశ్నించింది. పురాతన కట్టడాల సంరక్షణకు యువజన, సాంస్కృతిక, పర్యాటకాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేయాలని స్పష్టం చేసింది. ఈ కమిటీని ఏప్రిల్‌ 22న సమావేశపర్చేందుకు యువజన, సాంస్కృతిక అభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి చర్యలు తీసుకోవాలని తెలిపింది.  తదుపరి విచారణ నాటికి సమగ్ర నివేదికతోపాటు బ్లూప్రింట్‌ను కోర్టు పరిశీలనకు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈమేరకు సీజే హిమాకోహ్లీ, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ హైకోర్టు కేసుల విచారణలు ఇకమీదట పూర్తిగా ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. పాక్షికంగా జరుగుతున్న ప్రత్యక్ష విచారణ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు హైకోర్టు గురువారం ప్రకటించింది.  కరోనావ్యాప్తి దృష్ట్యా అన్ని బెంచ్‌లు ఆన్‌లైన్‌లోనే విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది. 

Updated Date - 2021-04-16T09:27:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising