ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భగీరథ నీరు వచ్చేది ఎప్పుడో?

ABN, First Publish Date - 2021-01-18T05:03:50+05:30

ప్రతీ గ్రామానికి పూర్తి స్థాయిలో నీరు అందించి గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కారస్తామ నే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేకంగా మిషన్‌భగీరథ కార్యక్రమా న్ని ప్రారంభించింది.

వృథాగా ఉంటున్న మిషన్‌ భగీరథ నల్లాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండేళ్లయినా పూర్తికాని పైపులైన్‌        
పూర్తిస్థాయిలో నిండని ట్యాంకులు      
పట్టించుకోని అధికారులు

తాడ్వాయి, జనవరి 17: ప్రతీ గ్రామానికి పూర్తి స్థాయిలో నీరు అందించి గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కారస్తామ నే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేకంగా మిషన్‌భగీరథ కార్యక్రమా న్ని ప్రారంభించింది. అందులో భాగంగా ప్రతీ గ్రామంలో అవస రమైన ట్యాంకులను నిర్మించడంతో పాటు మరికొన్ని చోట్ల పాత ట్యాంకులకే మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌లను అనుసంధానం చేసింది. కానీ చాలా గ్రామాలకు నేటికీ మిషన్‌ భగీరథ నీరు రావడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాడ్వాయి మండలం దేమెకలాన్‌లో మొత్తం 5 ట్యాంకులు ఉండగా రెం డు ట్యాంకులకు మాత్రమే నీరు అందుతోంది. మిగతా ట్యా ంకులు గ్రామంలోని బోరు బావుల ద్వారా నింపుతున్నారు. మిషన్‌ భగీరథ ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తయి నా ఇప్పటికీ గ్రామంలో పైప్‌లైన్‌లు పూర్తి కాలేదు. కొన్ని చోట్ల పైప్‌లైన్‌లు ఏర్పాటు చేసినా నీరు మాత్రం రావడం లే దని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్ల క్ష్యం కారణంగానే మిషన్‌ భగీరథ నీరు అందడం లేదని ఆరోపిస్తున్నారు. గ్రామంలో బోరుబావులు లేకుంటే పరిస్థితి అధ్వాన ంగా ఉండేదని సర్పంచ్‌ రాజు తెలిపారు. రెండు చోట్ల డిస్ట్రిబ్యూ షన్‌ లైన్‌కు లీకేజీ అయి నీరు పోతున్న విషయం అధికారుల దృష్టికి తీసుకుపోయినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. దెమెకలాన్‌ తో పాటు మండలంలోని చాలా గ్రామాలకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో నీరు రావడం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రారంభించిన అన్ని గ్రామా లకు తాగునీటిని అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో గ్రామాలకు మిషన్‌ భగీరథ నీరు వచ్చేట్లు చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.
మూడు ట్యాంకులను నింపుతున్నాం
బాలకిషన్‌, ఏఈ.
గ్రామంలో మూడు ట్యాంకులను మిషన్‌ భగీరథ నీటితో నింపుతు న్నాం. ఎక్కువ ఎత్తులో ఉండడంతో టెక్నికల్‌ సమస్యతో రెండు ట్యాం కులు నిండడం లేదు. గ్రామంలో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులు ఏర్పాటు మా పరిధిలో ఉండదు.

Updated Date - 2021-01-18T05:03:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising