ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటిపారుదల శాఖలో లస్కర్లు ఏరి?

ABN, First Publish Date - 2021-02-03T05:05:00+05:30

రైతులకు సాగునీరు అందించే ప్రధానమైన ప్రాజె క్టుల కాలువల పర్యవేక్షణకు గత ంలో ఇరిగేషన్‌ శాఖలో కిందిస్థాయి లో లస్కర్లు (మ్యాన్‌ మజ్దూర్‌) ఉండేవా రు. క్షేత్రస్థాయిలో కాలువలపై వీరి పర్యవేక్ష ణే కీలకంగా ఉండేది. ప్రాజెక్టులు నిండినా.. నిం డకపోయినా.. సాగునీరు విడుదల అయినా.. కాక పోయినా ఈ లస్కర్లు కాలువలపైనే విధులు నిర్వ హించేవారు.

బోధన్‌లోని ఇరిగేషన్‌ ఈఈ కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాతవారు ఉద్యోగ విరమణ చేసినా.. కొత్త నియామకాలు చేపట్టని ప్రభుత్వం  

కాలువలపై కరువైన పర్యవేక్షణ

బోధన్‌, ఫిబ్రవరి 2 : రైతులకు సాగునీరు అందించే ప్రధానమైన ప్రాజె క్టుల కాలువల పర్యవేక్షణకు గత ంలో ఇరిగేషన్‌ శాఖలో కిందిస్థాయి లో లస్కర్లు (మ్యాన్‌ మజ్దూర్‌) ఉండేవా రు. క్షేత్రస్థాయిలో కాలువలపై వీరి పర్యవేక్ష ణే కీలకంగా ఉండేది. ప్రాజెక్టులు నిండినా.. నిం డకపోయినా.. సాగునీరు విడుదల అయినా.. కాక పోయినా ఈ లస్కర్లు కాలువలపైనే విధులు నిర్వ హించేవారు. కాలువల పూర్తి బాధ్యత లస్కర్లపైనే ఉం డేది. ఇరిగేషన్‌ శాఖలో లస్కర్ల పాత్ర కీలకంగా ఉండేది. అన్ని ప్రాజెక్టుల పరిధిలో కాలువల పర్యవేక్షణకు లస్కర్ల నియామకాలు ఎప్పటికప్పుడు కొనసాగేవి. గతంలో నిజాం సాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని అన్ని డిస్ర్టిబ్యూటర్‌ల పరిధిలో కా లువలపై విధులు నిర్వహించేందుకు సుమారు 100 మందిపై నే లస్కర్లు విధుల్లో ఉండేవారు. అయితే ఇప్పుడు లస్కర్లు అన్న పదమే మరిచిపోయేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరిగేషన్‌ శాఖ లో లస్కర్లు అంటే ఎవరు? అన్న సందేహాలు ఏర్పడ్డాయి. ఆ శాఖ లో పనిచేసే సీనియర్‌ అధికారులకు తప్ప ఇటీవల విధుల్లో చేరిన కొత్త అధికారులకు అసలు లస్కర్లు అంటే అర్థం తెలియని పరిస్థి తులున్నాయి. గత కొన్నేళ్లుగా లస్కర్ల నియామకం లేకపోవడంతో గతంలో పనిచేసిన లస్కర్లు వయసు పైబడి కొందరు పదవీ విర మణ పొందగా, మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఇరిగేష న్‌ శాఖలో లస్కర్లు కనుమరుగయ్యారు. ఇప్పుడు నిజాంసాగర్‌ ప్రా జెక్టు పరిధిలో సుమారు 40 మంది వరకు లస్కర్లు మాత్రమే వి ధుల్లో ఉన్నారు. పాతవారు పదవీ విరమణ చేయడం.. ప్రాణాలు కోల్పోవడంతో మిగిలిన వారితోనే కాలం వెళ్లదీస్తున్నారు. కొత్తగా ఇరిగేషన్‌ శాఖలో లస్కర్ల నియామకాలు అంటూ ఏవీ లేకపోవ డంతో కిందిస్థాయిలో ఇరిగేషన్‌ శాఖలో సిబ్బంది లేకుండా పో యారు. కాలువలపై కీలక బాధ్యతలు నిర్వహించే లస్కర్లు లేకపోవడంతో ఇరిగేషన్‌ కాలువలు ఆనవాళ్లు లేకుండా పో తున్నాయి. కొన్నిచోట్ల కాలువలను కబ్జాకు చేస్తుంటే మరికొ న్ని చోట్ల కాలువల ఆనవాళ్లు లేకుండా ప్రధాన కాలువ లు, పిల్ల కాలువల పొడవునా కబ్జాచేసి దర్జాగా కాలువ లను మూసివేస్తున్నారు. ఇరిగేషన్‌ అధికారులు కా ర్యాలయాలను వదిలి బయటకు రాకపోవడం, వ చ్చినా నీటి విడుదల జరిగినప్పుడు మొక్కుబడి పర్యవేక్షణ చేయడం తప్ప కాలువలపై పూ ర్తిస్థాయిలో తిరిగే పరిస్థితులు లేకపోవ డంతో కాలువల పరిస్థితి అయోమ యంగా మారింది. దీంతో ఏకంగా నిజాంసాగర్‌ కాలువల కట్ట డాలను దర్జాగా కూల్చి వేస్తున్నారు. ఇరిగే షన్‌ శాఖలో లస్కర్లు లేకపోవడం ఆ శాఖలో కాలువలపై పర్యవేక్షణలేక కా లువలకు రక్షణ లేకపోవడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. 

లస్కర్ల నియామకంపై చిన్నచూపేలా?

ప్రభుత్వంలో ఇరిగేషన్‌శాఖ కీలకం. ఈ శాఖపైనే రైతాంగం  ఆ ధారపడి ఉంటుంది. రైతుల పంటలు, జీవన స్థితిగతులతో సంబం ధం ఉన్న అలాంటి ఇరిగేషన్‌ శాఖలో కిందిస్థాయిలో కీలక సిబ్బంది అయిన లస్కర్ల నియామకాలు యేళ్ల తరబడిగా లేకపోవడం ఇరిగే షన్‌ శాఖలో పర్యవేక్షణ లోపాన్ని చెప్పకనే చెబుతోంది. గతంలో ప్రాజెక్టుల పరిధిలో కాలువల పొడవునా లస్కర్లు మూడు కాలాల పాటు విధులు నిర్వహించేవారు. కాలువల్లో నీరు వచ్చినా.. రాకపో యినా లస్కర్లు మాత్రం తమ విధులను నిర్వహించేవారు. కాలువ లపై ఏ చిన్నపాటి తప్పిదం జరిగినా ఉన్నతాధికారులకు సమాచా రం అందేది. కాలువలకు బుంగలు పడ్డా, కాలువల కూల్చివేతలు జరిగినా, ఆక్రమణలు జరిగినా లస్కర్లు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసేవారు. అలాంటి లస్కర్లు కాలక్రమేణ అంతరిం చిపోతున్నారు. ప్రభుత్వాలు సైతం ఇరిగేషన్‌ శాఖలో ఇంజనీర్‌లు, కార్యాలయ సిబ్బందిని నియామకాలు జరుపుతూ కాలువలకు ఆ యువుపట్టు అయిన లస్కర్ల నియమకాలపై మాత్రం దృష్టి పెట్ట డం లేదు. కిందిస్థాయి సిబ్బంది అయిన వీరి నియమకంపై దృష్టి పెట్టకపోవడం ఇరిగేషన్‌ శాఖలో కిందిస్థాయి పర్యవేక్షణ లోపానికి ప్రధాన కారణమవుతోంది. కాలువలపై ఏం జరుగుతుందో అఽధికా రులకు తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరిగేషన్‌ శాఖలోని ఏఈ లు మొదలుకొని డీఈలు, ఈఈలు, ఎస్‌ఈలు చివరకు ఉన్నతస్థా యి అధికారులు పూర్తిస్థాయి పర్యవేక్షణ జరపలేకపోతున్నారు. కిం దిస్థాయిలో ఇరిగేషన్‌శాఖ ఏఈలు, డీఈలు తమ వద్ద సిబ్బంది లేరని చేతులు దులుపుకొనే పరిస్థితి ఏర్పడింది. ఇరిగేష న్‌శాఖలో ఎంతటి తప్పిదాలు జరిగినా సిబ్బంది కొరతను సాకూగా చూపి అధికారులు తప్పించుకుంటున్నారు. మరోవైపు ప్ర ధానంగా కాలువల పర్యవేక్షణ లస్కర్లు లేక గాడితప్పుతోంది. ఇటీవ ల కాలంలో నిజాంసాగర్‌ ప్రధాన కాలువలు, పిల్ల కాలువల పొడ వునా వర్ని, రుద్రూరు, మోస్రా, చందూరు, కోటగిరి మండలాలలో దర్జాగా కబ్జాలు కొనసాగుతున్నాయి. మరికొన్ని చోట్ల ఏకంగా యం త్రాలతో నిజాంసాగర్‌ కాలువలను, వాటి డ్రాప్‌లను కూల్చివేస్తున్నా రు. ఇప్ప టికైనా ప్రభుత్వం ఇరిగేషన్‌శాఖలో కాలువలపై పర్యవేక్ష ణ జరిపే లస్కర్ల నియామకంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

లస్కర్ల నియామకం కోసం ప్రతిపాదనలు పంపాం

వెంకటేశ్వర్లు ఇరిగేషన్‌ ఈఈ, బోధన్‌

ఇరిగేషన్‌శాఖలో కీలకమైన లస్కర్ల కొరత తీవ్రంగా ఉందని బోధన్‌ ఇరిగే షన్‌ ఈఈ వెంకటేశ్వర్లు ‘ఆంధ్రజ్యోతి’ తో తెలిపారు. గతంలో నిజాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో 100 మందిపైనే లస్కర్లు ఉండగా.. ఇప్పుడు 40 మంది మాత్రమే విధుల్లో ఉన్నారన్నారు. వీరి లో 18 మంది బాన్సువాడ సబ్‌ డివిజ న్‌లో.. 22 మంది  నిజాంసాగర్‌ సబ్‌ డివిజన్‌లో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. బోధన్‌ సబ్‌ డివి జన్‌లో నలుగురైదుగురిని డిప్యూటేషన్‌పై కొనసాగించుకుంటు న్నామని తెలిపారు. కొత్త నియామకాల కోసం ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపామన్నారు. లస్కర్లను ఇరిగేషన్‌శాఖలో మ్యాన్‌ మజ్దూర్‌, ఉమెన్‌ మజ్దూర్‌గా పిలవడం జరుగుతోందని ఆయన తెలిపారు. సిబ్బంది కొరత పర్యవేక్షణ లోపానికి కారణమవుతోం దని ఆయన అన్నారు.

Updated Date - 2021-02-03T05:05:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising